1980లో, ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను మద్యం, సిగరెట్లు, మాంసం తినేవాడినని, కానీ ఇప్పుడు మానేశానని ప్రకటించారు. కలకత్తాలో ఉన్నప్పుడు, రోజుకు 200 సిగరెట్లు తాగేవాడినని, చేతికి ఏది దొరికితే అది తాగేవాడినని బిగ్ బి ఒప్పుకున్నారు.
కానీ ముంబైకి వచ్చాక ఆ అలవాట్లన్నీ మానేశారు. మతపరమైన కారణాల వల్ల కాదు, తనకు అవసరం లేదని అర్థం చేసుకున్నందున మానేశాను అని అన్నారు అమితాబ్.