అవుట్ డోర్ షూటింగ్, ఆ ఇద్దరూ పడుకోవాలని అడిగారు.. ఇషా గుప్తాకు లైంగిక వేధింపులు, చాలా డర్టీగా..

First Published | Oct 31, 2021, 1:13 PM IST

చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. సినిమా అనే రంగుల ప్రపంచంలోకి కలలు కంటూ వచ్చే వర్తమాన నటీమణులకు కాస్టింగ్ కౌచ్ శాపంగా మారుతోంది. కొందరు నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ ని ధైర్యంగా ఎదుర్కొని రాణిస్తున్నారు.

బాలీవుడ్ నటి ఇషా గుప్తా బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. నార్త్ కి చెందిన ఈ బ్యూటీ గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. ఇషా గుప్తా అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఈ హాట్ గర్ల్ కనిపించింది చాలా తక్కువ. సౌత్ లో ఇషా గుప్తా ఒకటి రెండు చిత్రాల్లోనే మెరిసింది. సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ ఫోటోలతో రెచ్చిపోయే ఇషా గుప్తా ఇంటర్నెట్ లో హాట్ బాంబ్ గా ముద్ర వేయించుకుంది. 

Esha Gupta

ఎవరేమనుకున్నా తన బోల్డ్ ఫోటోషూట్స్ ట్రెండ్ కొనసాగిస్తోంది ఈ భామ. వృత్తి పరంగా గ్లామర్ ఒలకబోసే Esha Gupta..రియల్ లైఫ్ లో భిన్నంగా ఉంటుంది. ఎవరికీ భయపడని మనస్తత్వం ఇషా గుప్తాది. తాజాగా చిత్ర పరిశ్రమలో ఇషా తనకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకుంది. 


Esha Gupta

చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. సినిమా అనే రంగుల ప్రపంచంలోకి కలలు కంటూ వచ్చే వర్తమాన నటీమణులకు కాస్టింగ్ కౌచ్ శాపంగా మారుతోంది. కొందరు నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ ని ధైర్యంగా ఎదుర్కొని రాణిస్తున్నారు. కొందరు మాత్రం బలవుతున్నారు. తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. 

ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఓ సినిమా అవుట్ డోర్ షూటింగ్ లో నాకు రూమ్ బుక్ చేశారు. ఆ దర్శకుడి మనస్తత్వం నాకు తెలుసు. తనతో పడుకోవాలని అడిగాడు. కానీ అందుకు నేను అంగీకరించలేదు. రూమ్ లో కూడా నేను ఒక్కదాన్నే పడుకోలేదు. ఏదైనా సంఘటన జరగవచ్చు అనే భయంతో నా మేకప్ ఆర్టిస్ట్ ని కూడా తీసుకువెళ్లాను. 

లైంగిక కోరిక తీర్చలేదని ఆ దర్శకుడు నాతో అప్పటి నుంచి ప్రతీకార ధోరణిలో వ్యవహరించాడు. అవుట్ డోర్ షూటింగ్ కి నా తల్లి దండ్రులు కూడా అప్పుడప్పుడూ వచ్చేవారు. వారు లేని టైంలో ఆ దర్శకుడు నాతో కోపంగా ప్రవర్తించేవాడు. అలాగే ఓ నిర్మాత నుంచి కూడా నాకు వేధింపులు ఎదురయ్యాయి. దేనికైనా రెడీగా ఉండాలంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పావాడు. ఆ చిత్రంలో నేను అప్పటికే 5 రోజుల షూటింగ్ లో పాల్గొన్నాను. 

నిర్మాత అడిగిన విషయానికి నేను ఒప్పుకోలేదు. దీనితో నన్ను ప్రాజెక్ట్ నుంచి తప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ చిత్ర నిర్మాత నాకు అండగా నిలిచారు అని ఇషా తెలిపింది. ఆమె ఎందుకు ఈ సినిమాలో.. తొలగించేద్దాం అని ఆ నిర్మాత దర్శకుడితో చెప్పగా.. నో ఆమె నా సినిమా హీరోయిన్ అంటూ నాకు సపోర్ట్ చేశారు అని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఈ రెండు తన కెరీర్ లో ఎదురైన డర్టీ సంఘటనలు అని ఇషా తెలిపింది. 

Latest Videos

click me!