హైపర్ ఆది మైక్ అందుకుంటే ప్రాసల ప్రవాహం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. హైపర్ ఆది వేసే పంచ్ లు, చెప్పే మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. అందుకే బుల్లితెరపై హైపర్ ఆది ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. హైపర్ ఆది ఎలాంటి సంచలన విషయాల గురించి అయినా జనాల్ని ఆకట్టుకునేలా మాట్లాడతారు. ఇటీవల రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హైపర్ ఆది హాజరయ్యారు.