సామాన్యుడుకి షాక్: ‘పుష్ప-2’సింగిల్ స్క్రీన్ టిక్కెట్ అంత రేట్లు పెంచేస్తున్నారా?

First Published | Nov 20, 2024, 9:58 AM IST

అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప 2” సినిమా భారీ థియేటర్ బిజినెస్ చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుబడిని తిరిగి పొందేందుకు టిక్కెట్ ధరలను పెంచనున్నారు.

Allu Arjun, #Pushpa2, sukumar


అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప 2” గురించే అందరూ మాట్లాడుతున్నారు. ఈ సినిమా భారీ ఎత్తున థియేటర్ బిజినెస్ అయ్యింది. నిర్మాతలు ఆంధ్రాలో రికార్డ్ రేటుకు రైట్స్ అమ్మారు. ఇప్పుడు అంతంత రేట్లు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ తాము పెట్టిన డబ్బుని రికవరీ చేసుకునేందుకు సిద్దమయ్యారు. అందుకోసం భారీ ఎత్తున టిక్కెట్ రేట్లు పెంచబోతున్నట్లు సమాచారం. 


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..డిస్ట్రిబ్యూటర్స్ ...సింగిల్ స్క్రీన్ రేట్లు భారీగా పెంచబోతున్నారు. 300 దాకా టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ఫర్మిషన్ ఇవ్వమని గవర్నవమెంట్ దగ్గర ప్రపోజల్ పెట్టారు. మొదటి వారం అంతా ఆ రేటుకు సినిమాని ప్రదర్శిస్తామని తర్వాత వారం తగ్గిస్తామని అడుగుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఈ రేటుతో అఫీషియల్ గా సింగిల్ స్క్రీన్ టిక్కెట్లు అమ్మలేదు. 


Allu Arjun, #Pushpa2, sukumar


థియేటర్ యజమానులు మొదటి రోజు ఉన్న క్రేజ్ తో అనీఫిషియల్ గా  పెంచి అమ్మటం జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు 300 రేటు అఫీషియల్ గా ఫర్మిషన్ ఇస్తే వారు దానికి ఎంత కలుపుకుని అమ్ముతారో చూడాల్సి ఉంది. నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు నవీన్ , రవిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంచి కనెక్షనే ఉంది కాబట్టి ఆ రేట్లుకు ఫర్మిషన్స్ వచ్చే అవకాసం ఉందంటున్నారు. అదే జరిగితే కనుక విమర్శలు అయితే వస్తాయి. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ రేంజిలో  జరిగింది. నాన్ థియేటర్ రెవిన్యూలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.పుష్ప 2 చిత్రం ఓటిటి, శాటిలైట్, ఆడియో రైట్స్ విషయంలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పిన దాని ప్రకారం పుష్ప 2 హిందీ వెర్షన్ రైట్స్ 260 కోట్లు పలికాయి.  

ఏ సౌతిండియన్ సినిమా ఈ రేటు పలకలేదు.  ఈ రేటుతోనే చెప్పచ్చు...నార్త్ లో ఈ సినిమాకు ఏ స్దాయి క్రేజ్ ఉంది అనేది. ఇదొక ఫ్యాన్సీ డీల్ అని చెప్పాలి.  అయితే ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే మినిమం మూడు  వారాలు అయినా హౌస్ ఫుల్స్ తో నార్త్ లో  ఆడాలని అంటున్నారు.  


తెలుగు రాష్ట్రాల్లో ఎలాగో అల్లు అర్జున్ మేనియాతో నడిచిపోతుంది. ఇప్పుడు నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ తనదైన ముద్ర వేస్తున్నట్లే.  గతంలో నార్త్ లో రికార్డులు తిరగరాసింది పుష్ప చిత్రం. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసేశాయి.

నార్త్ లో పుష్ప రూ.108 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ‘పుష్ప’ కి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ (Pushpa2) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది.
ఈ సినిమా భారీ రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.  సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమా కోసం రాత్రింబవళ్లూ పని చేస్తున్నారు.  

Allu Arjun, #Pushpa2, sukumar

  ఈ సినిమాతో ఎట్టిపరిస్దితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన పరిస్దితి సుకుమార్. అయినా ఆ ఒత్తిడిని తన మీద పడనివ్వకుండా సుకుమార్ చాలా జాగ్రత్తగా సినిమా అన్ని అంశాలు అద్బుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ప్రాణంగా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్,   VFX క్వాలిటీ మిస్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు  VFX వర్క్ యూరప్ లో చేయించారు.
 

Latest Videos

click me!