బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. హైపర్ ఆది కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ తో పాటు గ్లామర్ ముద్దు గుమ్మలని ఇరకాటంలో పెట్టే విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతుంటాడు.
ప్రస్తుతం ఢీ సెలెబ్రిటీ స్పెషల్ షో జరుగుతోంది. హైపర్ ఆది కామెడీ పంచ్ లతో, అల్లరి చేష్టలతో మధ్యలో వినోదం అందిస్తున్నాడు. డ్యాన్స్ కాంపిటీషన్ కావడంతో కంటెస్టెంట్స్ అంతా హీటెక్కించే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇండియా విషయంలో మాల్దీవుల వైఖరి ఎంత వివాదంగా మారిందో తెలిసిందే. మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ప్రధాని మోడీ మన లక్ష్య ద్వీప్ ని ప్రమోట్ చేస్తున్నారు. సినీ తారలు కూడా బాయ్ కాట్ మాల్దీవుల పిలుపు ఇస్తున్నారు. ఇటీవల నాగార్జున కూడా మాల్దీవుల తీరుని తప్పు బట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఢీ సెలెబ్రిటీ షోలో హైపర్ ఆది తనదైన కామెడీ పంచ్ లతో మాల్దీవులపై సెటైర్లు వేసినట్లు ఉన్నాడు. మాల్దీవులకు ఎవరు వెళ్లినా కేవలం శృంగారం కోసమే వెళతారు అనే అర్థం వచ్చేలా హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్ లో బిగ్ బాస్ జెస్సి కూడా బలయ్యాడు. కంప్లీట్ ఎపిసోడ్ చూస్తే హైపర్ ఆది మాల్దీవులపై వేసిన సెటైర్లు ఏంటో అర్థం అవుతుంది.
ఇక ఈ షోలో హైలైట్ గా నిలిచింది అంటే బిగ్ బాస్ జెస్సి జశ్వంత్ అనే చెప్పాలి. వెంకీ చిత్రంలోని మాస్ తో పెట్టుకుంటే అనే పాటకు దుమ్ము లేచిపోయేలా జెస్సీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మాస్ స్టెప్పులతో చెలరేగిపోతూనే.. రొమాన్స్ లో తన కసి కూడా చూపించాడు.
జశ్వంత్ డ్యాన్స్ పర్ఫామెన్స్ కి, ఆ ఫైర్ కి అక్కడున్న జడ్జీలు ఆశ్చర్యపోయారు. శేఖర్ మాస్టర్, ప్రణీత సుభాష్, గణేష్ మాస్టర్.. జశ్వంత్ ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ రోజు స్టేజీనా నేనా తేలిపోవాలి అన్నంత కసిగా జెస్సీ పెర్ఫామ్ చేశాడని గణేష్ మాస్టర్ అన్నారు.