రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో నటించారు. దీంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. తరచూ ఈ ఇద్దరు కలుసుకుంటారు. విజయ్ ఇంటికి రష్మిక మందన్నా వస్తుంటుంది. వాళ్ల ఇంట్లోనే పండగలు సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికితోడు ఈ ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్తున్నారని, మాల్డీవులు వంటి వెకేషన్‌కి వెళ్తున్నారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి.
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఒకే చోట ఉన్నట్టుగా చాలా ఫ్రూప్స్ చూపించారు నెటిజన్లు. దీంతో ఈ ఇద్దరు కలిసే తిరుగుతున్నారని, ప్రేమలో ఉన్నారని కన్పమ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు డేటింగ్ విషయం గత రెండు మూడేళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ వచ్చారు. లవ్ లో ఉన్నారనే విషయంలో మాత్రం ఆచితూచి మాట్లాడారు. అది నిజం కాదనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. రష్మిక సైతం రూమర్స్ మాట్లాడుకోవచ్చు, కానీ శృతి మించిన కామెంట్లని, ట్రోల్స్ ని తాను సహించనని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఇద్దరి పెళ్లివార్తలు ఊపందుకున్నాయి. అవి తారా స్థాయికి చేరాయి. ఫిబ్రవరిలోనే పెళ్లికి సిద్ధమయ్యారని, ఇక ఈ జంట ఒక్కటి కాబోతుందని, ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు. పెళ్లి రూమర్‌లో నిజం ఏంటో చెప్పారు. ఆయన ఓ ఇంగ్లీష్ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పారు.
లైఫ్ స్టయిల్ ఏషియా ఇండియా అనే మేగజీన్ లో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరిలో నాకు పెళ్లిగానీ, ఎంగేజ్‌మెంట్‌గానీ జరగడం లేదు. ఈ మీడియా నాకు ప్రతి ఏడాది పెళ్లి చేయాలని చూస్తుంది. ప్రతి సారి ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నాను. దొరికితే పెళ్లి చేయాలనుకుంటున్నారు` అంటూ సెటైరికల్‌గా, ఫన్నీగా విజయ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి రూమర్‌కి విజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదన్నారు. అయితే రష్మికతో ప్రేమ విషయం మాత్రం ప్రస్తావించలేదు.
ఇక ఇందులో విజయ్ దేవరకొండ సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడారు. తనలో వచ్చిన మార్పు గురించి చెప్పారు. `లైగర్` లాంటి డిజాస్టర్ తర్వాత స్క్రిప్ట్ ఎంపికలో ఏం మార్పు లేదని, ఎందుకంటే ఈ మూవీ స్క్రిప్ట్ ని ఇష్టపడే చేశానని, దానికోసం ఎంతో కష్టపడ్డానని, సర్వస్వం ఇచ్చానని తెలిపారు. తనలో మార్పు వచ్చిందని, మారాలనే విషయాన్ని తాను ఆలోచించడం లేదని, జరిగింది జరిగిపోయింది, రాబోయే విషయాలపైనే ఫోకస్ అని తెలిపారు. జీవితం సాగిపోతుందని, మనం ముందుకు వెళ్లాలి అని తెలిపారు.
విజయ్ దేవరకొండ ఇప్పుడు `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్‌కి రాబోతుంది. ఇక రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తుంది. దీంతోపాటు `ది గర్ల్ ఫ్రెండ్`, `రెయిన్‌బో` మూవీస్ చేస్తుంది. అలాగే ధనుష్-శేఖర్ కమ్ముల చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.