Hyper Aadi: జబర్దస్త్ కి రావాలనుకోలేదు, తన ఎంట్రీ వెనకున్న అసలు నిజాలు బయటపెట్టిన స్టార్ కమెడియన్!

Published : Mar 30, 2024, 12:54 PM IST

జబర్దస్త్ లో హైపర్ ఆది ఒక సెన్సేషన్. అనతి కాలంలో ఎదిగిన ఈ స్టార్ కమెడియన్ బుల్లితెరను ఏలుతున్నాడు. అయితే జబర్దస్త్ కి తాను ఎప్పుడూ రావాలని అనుకోలేదంటూ, తన ఎంట్రీ వెనకున్న నిజాలు బయటపెట్టాడు...   

PREV
16
Hyper Aadi: జబర్దస్త్ కి రావాలనుకోలేదు, తన ఎంట్రీ వెనకున్న అసలు నిజాలు బయటపెట్టిన స్టార్ కమెడియన్!


హైపర్ ఆది రాకముందు జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్ టీం గుర్తుకు వచ్చేది. సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కాంబోలో సంచలనాలు నమోదు అయ్యాయి. ప్రతి వారం వాళ్ళే స్కిట్ కొట్టేవాళ్ళు. హైపర్ ఆది టీం లీడర్ అయ్యాక వాళ్లకు సరైన పోటీ ఎదురైంది. 


 

26

జబర్దస్త్ కి హైపర్ ఆది, ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ టీం లు గుండెకాయల్లా మారాయి. హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ స్కిట్స్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ రాబట్టేవి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హైపర్ ఆది స్కిట్ చూసేవాళ్ళు. 

36
dhee promo

శాంతి స్వరూప్ , రైజింగ్ రాజుల మీద హైపర్ ఆది వేసే పంచులు ఓ రేంజ్ లో పేలేవి. కాంటెంపరరీ ఇష్యూస్ ఆధారంగా కూడా హైపర్ ఆది పదునైన పంచులు వేసేవాడు. హైపర్ ఆది స్కిట్ అంటే నాన్ స్టాప్ పంచులకు గ్యారంటీ అన్నట్లు మారింది. ఆ క్రేజ్ తో ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో అడుగుపట్టిన హైపర్ ఆది దుమ్మురేపుతున్నాడు. 


 

46

ఒక టీం మెంబర్ నుండి టీం లీడర్ గా ఎదిగిన జబర్దస్త్ కారణంగా హైపర్ ఆది స్టార్ అయ్యాడు. అయితే హైపర్ ఆది జబర్దస్త్ కి రావాలని అనుకోలేదట. తాను ఎలా వచ్చాడో ఓ సందర్భంలో వివరించాడు... జబర్దస్త్ కి రావాలని హైదరాబాద్ రాలేదు. నాకు పక్కవాళ్ళని నవ్వించడం ఇష్టం. కూర్చుని చేసే జాబ్ బోర్ కొట్టేసింది. నలుగురిని నవ్వించడానికి జబర్దస్త్ వేదిక అనిపించింది. 

56


ఆ క్రమంలో అత్తారింటికి దారేది మూవీ స్పూఫ్ చేసి యూట్యూబ్ లో పెడితే వేల మంది చూశారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే... అదిరే అభి చూసి, చాలా బాగా చేశావు. ఒకసారి కలువు బ్రదర్ అన్నాడు. అదిరే అభిని కలిశాను. జబర్దస్త్ కమెడియన్స్ తో ఫోటోలు దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే... వందల లైక్స్ వచ్చాయి. 


 

66
photo credit-dhee promo

కేవలం ఫోటోలు పోస్ట్ చేస్తేనే ఇంత మంది లైక్స్ కొట్టారు. వాళ్లతో కలిసి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అప్పుడు జబర్దస్త్ కి వచ్చాను.. అని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories