అనసూయ ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్.. ఎక్కడ కట్‌ చేయాలో తెలుసు.. రంగమ్మత్త రియల్ క్యారెక్టర్‌ బయటపెట్టిన హైపర్‌ఆది

Published : Apr 24, 2024, 10:03 PM ISTUpdated : Apr 25, 2024, 10:47 AM IST

అనసూయ ధరించే దుస్తులు, ఫోటో షూట్లపై విమర్శలు, వల్గర్ కామెంట్లు వస్తుంటాయి. ఆమె క్యారెక్టర్‌ని ప్రశ్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో దీనిపై హైపర్‌ ఆది రియాక్ట్ అయ్యాడు.   

PREV
18
అనసూయ ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్.. ఎక్కడ కట్‌ చేయాలో తెలుసు.. రంగమ్మత్త రియల్ క్యారెక్టర్‌ బయటపెట్టిన హైపర్‌ఆది

హైపర్‌ ఆది జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ షోతోనే అనసూయ కూడా యాంకర్‌గా నిలబడ్డారు. పాపులర్‌ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. అయితే సోషల్‌ మీడియాలో అనసూయపై తరచూ దారుణంగా ట్రోల్స్ జరుగుతుంటాయి. దాని గురించి రియాక్ట్ అయ్యాడు ఆది.  
 

28

అనసూయ సోషల్‌ మీడియాలో ప్రతి విషయానికి స్పందిస్తుంటుంది. సామాజిక విషయాలపై కూడా ఆమె స్పందిస్తుంటుంది. ఆమె పోస్ట్ లపై నెటిజన్లు విమర్శలు చేయడం, ట్రోల్‌ చేయడం జరుగుతుంటుంది. దీనికి ఆమె కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అవుతుంది. దీంతో ఇష్యూ పెద్దది అవుతుంది. ఆమె వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేసే స్థాయికి వెళ్తుంది. వాటిని అంతే ధైర్యంగా ఎదుర్కొంటుంది అనసూయ. 
 

38

అనసూయ డ్రెస్‌పై, ఫోటో షూట్లపై వల్గర్ కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. డ్రెస్‌ని బట్టి ఆమె క్యారెక్టర్‌ని డిసైడ్‌ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు. అందుకే అనసూయ రియాక్ట్ అవుతుంటుంది. వాళ్ల నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే అనసూయకి ఎందుకు ఇవన్నీ అని సెలబ్రిటీలు, కామన్‌ ఆడియెన్స్ అంటుంటారు. ఆమె రియాక్ట్ కాకపోతే ఈ గొడవలు ఉండేవి కావుగా అంటుంటారు. 
 

48

ఈ నేపథ్యంలో తాజాగా హైపర్‌ ఆది కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. అనసూయ డ్రెస్‌ని బట్టి ఆమె క్యారెక్టర్‌ని డిసైడ్‌ చేస్తుంటారు. ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. కానీ అనసూయ వ్యక్తిగతంగా చాలా స్ట్రిక్ట్ అని, అలాంటి విషయాలకు దూరంగా ఉంటుందని, ఏ పరిధిలో ఉండాలో ఆమెకి బాగా తెలుసు అని తెలిపారు హైపర్‌ ఆది. 
 

58

అనసూయతో ఈజీ కాదని, ఎవరైనా ఆమె విషయంలో చనువు తీసుకున్నా, వారిని ఎక్కడ కట్‌ చేయాలో అక్కడ చేస్తుందని, ఆ లైన్‌ బాగా తెలుసు అన్నారు ఆది. ఆ విషయంలో ఎవరూ హద్దుదాటలేరని, ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు హైపర్‌ ఆది.
 

68

ట్రోల్స్ పై, విమర్శలపై ఎందుకు స్పందించడం, లైట్‌ తీసుకుంటే అయిపోతుంది కదా అన్న ప్రశ్నకి ఆది రియాక్ట్ అవుతూ కొందరు అంతే అని, చూసినప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉండలేరు, ఆటోమెటిక్‌గా అటు వెళ్లిపోతుంటారు. అనసూయ కూడా అంతే అని, ఆమె తనకు నచ్చనవి, తనకు ఇబ్బందిగా అనిపించిన వాటికి రియాక్ట్ అవుతుంది, అది ఆమె మనస్థత్వం అని చెప్పారు ఆది. 

78

న్యూస్‌ యంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత నటిగా మారింది. అనంతరం `జబర్దస్త్` యాంకర్‌గా చేరింది. ఆ షో ఆమెకి స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. స్టార్‌ యాంకర్‌గా విశేష అభిమానులను, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఫోటో షూట్లతో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఇక నటిగా అద్భుతమైన పాత్రలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు `జబర్దస్త్` మానేసి నటిగా బిజీగా ఉంది. త్వరలో ఆమె `పుష్ప2`తో రాబోతుంది. 

88

హైపర్‌ ఆది.. అదిరే అభి టీమ్‌లో కమెడియన్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు.టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. తనే స్కిట్లు రాస్తూ, పంచ్‌ డైలాగులు పేల్చుతూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నారు. దీంతో జబర్దస్త్ ని మానేశాడు. ఓవైపు `ఢీ` షో, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలు చేస్తున్నారు. అలాగే కమెడియన్‌గా పెద్ద సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు ఆది. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నాడు. పవన్‌ కళ్యాణ్‌ తో జనసేన పార్టీలో కొనసాగుతున్నాడు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories