అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో హైదరాబాద్ విజయం సునాయాసం అయింది. హైదరాబాద్ మ్యాచ్ అంటే ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా హైలైట్ అవుతుంటారు. జట్టు ఓడిపోతే ఆమె బాధపడడం, గెలిస్తే సంతోషంతో గెంతులేయడం లాంటి ఎమోషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.