జబర్దస్త్ వేదికగా స్టార్స్ అయిన కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి టీమ్ లో చేసిన హైపర్ ఆది తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యారు. హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ జబర్దస్త్ లో నయా రికార్డ్స్ నమోదు చేసింది. హైపర్ ఆది స్కిట్స్ కారణంగా జబర్దస్త్ భారీ టీఆర్పీ దక్కించుకుంది. మల్లెమాలకు హైపర్ ఆది బంగారు బాతులా దొరికాడు. అందుకే ఢీ షోకి కూడా వాడేశారు.
హైపర్ ఆది పంచ్ల పవర్ మామూలుగా ఉండదు. సమయానుసారంగా ఓ రేంజ్ లో పేలుతాయి. అయితే హైపర్ ఆది కామెడీ పలుమార్లు వివాదాస్పదమైంది. ఆయన జోక్స్ కొందరి మనోభావాలు దెబ్బతీశాయి. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సందర్భాల్లో ఆది బహిరంగ క్షమాపణలు చెప్పారు.