Honey Rose: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్..? స్వయంగా క్లారిటీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ!

Published : Jul 26, 2023, 02:26 PM IST

వీరసింహారెడ్డి ఫేమ్ హనీ రోజ్ గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకున్నట్లు ప్రచారం అవుతుండగా, ఆమె స్పందించారు. హనీ రోజ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.   

PREV
17
Honey Rose: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్..? స్వయంగా క్లారిటీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ!
Honey Rose

ఒక్క మూవీ హనీ రోజ్ కి ఎక్కడ లేని ఫేమ్ తెచ్చింది. వీరసింహారెడ్డి మూవీలో ఈ మలయాళీ భామ రెండు భిన్నమైన పాత్రల్లో మెప్పించారు. వీరసింహారెడ్డి సూపర్ హిట్ కాగా హనీ రోజ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆ మధ్య ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కి హైదరాబాద్ వచ్చిన హనీ రోజ్ ని అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. 

 

27

ఈ సందర్భంగా హనీ రోజ్ మీడియాతో మాట్లాడారు.  వీరసింహారెడ్డి మూవీలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. బాలకృష్ణ వంటి లెజెండ్ తో నటించే అవకాశం రావడం సంతోషం. నేను రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్  చేశాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. గోపీచంద్ మలినేని ఫోన్ చేసి నా పాత్ర గురించి వివరించారు. ఇక షూటింగ్ సమయంలో బాలయ్య నాకు సలహాలు ఇచ్చారు. 

37

నటన అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. 2005లోనే పరిశ్రమకు వచ్చాను. సినిమాలు తప్ప నాకు మరో పని తెలియదు. నేను కేరళ ఫుడ్ బాగా ఇష్టపడతాను. హైదరాబాద్ బిర్యానీ, రైస్ , పెరుగు కూడా నచ్చాయి. పెళ్లి అనేది ఒక బాధ్యత. అందుకే నేను ప్రతి విషయాన్ని ప్రేమిస్తాను. అంత వరకే వెళతాను. సోషల్ మీడియాలో మంచి చెడు రెండూ ఉంటాయి... అని హనీ రోజ్ చెప్పుకొచ్చారు. 

 

47

కాగా హనీ రోజ్ అందం కోసం సర్జరీ చేయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఆమె స్పందించారు. ప్రచారం అవుతున్నట్లు నేను సర్జరీలు చేయించుకోలేదు. నాది సహజ అందమే అన్నారు. గ్లామర్ కోసం కాస్మెటిక్ వాడతాను, అయితే సర్జరీలను ఆశ్రయించలేదు. నటిగా ఉండటం అంత సులభం కాదని, ఆమె అభిప్రాయపడ్డారు. 

57

హనీ రోజ్ తెలుగులో చేసిన మొదటి చిత్రం ఆలయం. 2008లో ఈ చిత్రం విడుదలైంది. శివాజీ హీరోగా నటించారు. ఆ సినిమా ఆడకపోవడంతో హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. 2014లో వరుణ్ సందేశ్ కి జంటగా ఈ వర్షం సాక్షిగా అనే చిత్రం చేశారు. 

 

67

ఎనిమిదేళ్ల తర్వాత వీరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వీరసింహారెడ్డిలో హనీ రోజ్ బాలయ్యకు భార్యగా, తల్లిగా నటించారు. తెలుగులో హనీ రోజ్ కి ఆఫర్స్ పెరుగుతున్నట్లు సమాచారం. భవిష్యత్ లో ఆమె మరిన్ని చిత్రాల్లో దర్శనమివ్వనుంది. 

77


హనీ రోజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ రాచెల్. తెలుగులో ఈ చిత్రానికి రాహేలు అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా చిత్రంగా  తెలుగు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఆనందిని బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతుంది. 

click me!

Recommended Stories