జామ్ జామ్ జామ్ జజ్జనక అనే సాంగ్ తనకు ఎంతో ప్రత్యేకం అని హైపర్ ఆది తెలిపారు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలోనే నా బర్త్ డే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో బర్త్ డే జరుపుకునే అవకాశం వచ్చింది. గ్యాంగ్ లీడర్ చిత్రంలోని చిరంజీవి యాటిట్యూడ్, ఇంద్ర లోని డ్యాన్సులు, శంకర్ దాదాలోని కామెడీ టైమింగ్, హిట్లర్ లోని సెంటిమెంట్ ఇలా అన్ని కలగలిపిన చిత్రంలాగా భోళా శంకర్ ఉండబోతోంది అని హైపర్ ఆది అన్నారు.