Thalapathy Vijay
హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా ఉంది. ఆయన విజయ్ మక్కల్ ఇయక్కమ్(VMI) సభ్యులతో తరచుగా భేటీ కావడంతో పొలిటికల్ ఊహాగానాలకు బలం చేకూరుతుంది. తాజాగా ఆయన పాదయాత్రకు పూనుకున్నారన్న వార్త మరింత అలజడి రేపుతోంది. జులై 11న విజయ్ చెన్నై పనయూర్ ఆఫీస్ లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులను కలిశారు.
vijay
ఈ మీటింగ్ లో విజయ్ తన పాదయాత్ర ఆలోచన బయపెట్టారని సమాచారం. ఆయన లేటెస్ట్ మూవీ లియో విడుదలకు ముందే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారట. అయితే ఇంత తక్కువ సమయంలో పూర్తి రాష్ట్రాన్ని చుట్టేయడం కష్టం. మొదటి విడతగా ఆయన కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసే అవకాశం కలదంటున్నారు.
vijay
సీఎం పదవికి పాదయాత్ర సెంటిమెంట్ గా ఉంది. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన పలువురు రాజకీయనాయకులు సీఎం పీఠం అధిరోహించారు. ఆ సెంటిమెంట్ ని విజయ్ బలంగా నమ్ముతున్నాడని తెలుస్తుంది. అదే సమయంలో ప్రజల సమస్యలు దగ్గరగా చూసే ఆస్కారం దొరుకుతుంది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చే హామీలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.
మేనిఫెస్టో రూపొందించడానికి కూడా పాదయాత్ర గొప్పగా సహకరిస్తుంది. ఈ కారణాలతో విజయ్ పాదయాత్రకు పూనుకున్నాడట. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో అక్టోబర్ 19న విడుదల కానుంది. అంటే అతి త్వరలో విజయ్ పాదయాత్ర మొదలుపెట్టానున్నారు. ఈ పాదయాత్రపై విజయ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
లియో అనంతరం దర్శకుడు వెంకట్ ప్రభుతో విజయ్ ఒక మూవీకి కమిట్ అయ్యాడు. ఆ చిత్రం పూర్తయ్యాక విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టనున్నాడట. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న మూడేళ్లు విజయ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కానున్నారట. అలాగే వెంకట్ ప్రభు మూవీ చివరిది అంటున్నారు. సినిమాలకు ఆయన విరామం ప్రకటిస్తారట.
ప్రస్తుతం విజయ్ ఏజ్ 49 సంవత్సరాలు. ప్రజాసేవకు ఇదే సరైన సమయం అని ఆయన భావిస్తున్నారట. వయసు పైబడ్డాక శరీరం సహకరించదు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే పాలిటిక్స్ లోకి రావాలని ఆయన ఆలోచన అని తెలుస్తుంది. రజనీకాంత్ వలె ఆయన ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారట.
కోలీవుడ్ లో విజయ్ టాప్ స్టార్ గా అవతరించారు. ఆయన ప్లాప్ సినిమాలు కూడా వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. రజినీకాంత్ నుండి నెంబర్ వన్ పొజిషన్ లాక్కున్న విజయ్ రాజకీయంగా కూడా సంచనాలు చేసేందుకు పూనుకున్నాడట.