హైపర్‌ ఆది ఇంత కరువులో ఉన్నాడా?.. స్టేజ్‌పైనే అందరి ముందు లేడీ డాన్సర్లతో సరసం.. ఏంటీ దారుణం?

Published : Jan 12, 2024, 05:32 PM IST

హైపర్‌ ఆది ఏ షోలో ఉన్నా అందులో కామెడీకి కొదవ లేదు. తనదైన డైలాగులు, పంచ్‌లతో నవ్వులు పూయిస్తూనే ఉంటాడు. అయితే ఆయన వ్యవహారం కొన్ని సార్లు కంట్రోల్‌ తప్పేలానూ ఉంటుంది.   

PREV
15
హైపర్‌ ఆది ఇంత కరువులో ఉన్నాడా?.. స్టేజ్‌పైనే అందరి ముందు లేడీ డాన్సర్లతో సరసం.. ఏంటీ దారుణం?

హైపర్‌ ఆది `జబద్దస్త్` షోతో పాపులర్‌ అయ్యాడు. అందులో తనదైన పంచ్‌లతో మెప్పించాడు. సుడిగాలి సుధీర్‌ టీమ్‌లో రచ్చ చేశాడు. పంచ్‌లకు పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయించాడు. కానీ ఇప్పుడు జబర్దస్త్ ని మానేశాడు. కేవలం `ఢీ` షోలో మెరుస్తున్నాడు. మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. 
 

25

ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `ఢీ` షోలు చేస్తున్నాడు. ఇందులో ఆయన మార్క్ కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. కానీ తాజాగా `ఢీ` షోలో ఆయన చేసిన రచ్చ హాట్‌ టాపిక్‌ అవుతుంది. లేడీ డాన్సర్లతో కలిసి స్టేజ్‌పైనే రచ్చ రచ్చ చేశాడు ఆది.
 

35

బాయ్స్ డాన్సర్లు, లేడీ డాన్సర్లు కలిసి కబడ్డీ ఆట ఆడారు. `ఢీ` షోలో స్టేజ్‌పైనే ఓ ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారు. అయితే లేడీ డాన్సర్ల కోర్ట్ లోకి కూతకు వెళ్లాడు హైపర్‌ ఆది. అందరు కలిసి ఆయన్ని రౌండప్‌ చేశారు. ఒకరు పట్టుకోగానే ఆగిపోయాడు. అంతేకాదు దారుణానికి తెగబడ్డారు. ఇలా పట్టుకుని వదిలేస్తారా? ఏదో ఒకటి చేయండి అంటూ వాదించాడు. 
 

45

కిందపడేసి ఏదో ఒకటి చేయండి అంటూ వారించాడు. దీంతో లేడీ డాన్సర్లు మరోసారి చుట్టుముట్టారు. ఆయన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. అయినా ఆగని ఆది, ఏదో చేయండి కింద పడిపోతాను చూడండి అంటూ రెచ్చిపోయాడు. కానీ ఆశించిన వాళ్లు చేయలేదు. అంతటితో వదిలేశారు. దీంతో ఇది షోలో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. 
 

55

దీంతో దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హైపర్‌ ఆది ఇంత కరువులో ఉన్నాడా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఆ లేడీ డాన్సర్లతో అదేం పని అంటున్నారు. అందుకే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని, పెళ్లి చేసుకుంటే ఈ బాధలు తప్పేవి కదా అంటూ పంచ్‌లు విసురుతున్నారు. మొత్తంగా ఈ ప్రోమో మాత్రం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇదిలా ఉంటే నాలుగు పదులకు దగ్గరలో ఉన్న ఆది ఇంకా పెళ్లి ఊసేత్తడం లేదు. మరి ఎప్పుడు చేసుకుండాటో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories