జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న షోలకు ఆదరణ తగ్గడం లేదు. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మిని ముడిపెడుతూ కామెడీ స్కిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ బుల్లితెరపై దూరమైనప్పటికీ ఆ తరహా పంచ్ లు పడుతూనే ఉన్నాయి.