Guppedantha Manasu 18th march Episode:బయటపడ్డ కొత్త జంట పోస్టర్లు.. మనుని కాలేజీ నుంచి గెంటేసిన అనుపమ..!

Published : Mar 18, 2024, 10:29 AM IST

ఓవైపు వసుధార కాలేజీని కాపాడుకోవడానికి, రిషిని వెతకడానికి తిప్పలు పడుతుంటే.. నువ్వు చేసిది ఇదేనా, ఈ పని చేసేటప్పుడు నీ కన్నవాళ్లు గుర్తుకు రాలేదని అని ఛెడామడా తిడుతుంది. 

PREV
16
Guppedantha Manasu 18th march Episode:బయటపడ్డ కొత్త జంట పోస్టర్లు.. మనుని కాలేజీ నుంచి గెంటేసిన అనుపమ..!
Guppedantha Manasu


Guppedantha Manasu 18th march Episode: కాలేజీ కి అనుపమ చేరుకుంటుంది. కాలేజీకి రావడం రావడమే.. ఎలాగైనా ఈ రోజు మనుతో మాట్లాడాలి అని అనుకుంటుంది. ఇన్ని రోజులు పంతంతో మనుతో మాట్లాడలేదని.. ఈ రోజు ఎలాగైనా మాట్లాడాలి అని.. మను క్యాబిన్ కి వెళ్తుంది. అయితే.. అక్కడ మను ఉండడు. ఇంకా రాలేదు అనుకుంట.. వచ్చిన తర్వాత మాట్లాడదాం అని అనుకొని వెళ్లిపోతుంటే.. మను డెస్క్ మీద పోస్టర్లు అనుపమ కంట పడతాయి.

26
Guppedantha Manasu

అవి ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే.. రాజీవ్ తెచ్చిన కొత్త జంట పోస్టర్లు అవి. అవి చూసి అనుపమ షాకౌతుంది. అప్పుడే వసుధార కూడా అటుగా వస్తుంది. వాటిని చూసి షాకౌతుంది. ఏంటి మేడమ్ ఇది అని వసుధార కంగారుగా అడిగితే.. నువ్వేమీ బయపడకు వసుధార.. ఏం కాదు అని అనుపమ ధైర్యం చెబుతుంది,

36
Guppedantha Manasu

సరిగ్గా అప్పుడే మను కూడా అక్కడికి వస్తాడు. వచ్చేసరికి.. మను నిచూసి అనుపమ కోపంతో రగిలిపోతుంది. ఈ పోస్టర్లు ఏంటి అని సీరియస్ అవుతుంది. మను చెప్పేది వినదు. బాగా తిడుతుంది. కాలర్ పట్టుకొని చెంపలు పగలకొడుతుంది. ఓవైపు వసుధార కాలేజీని కాపాడుకోవడానికి, రిషిని వెతకడానికి తిప్పలు పడుతుంటే.. నువ్వు చేసిది ఇదేనా, ఈ పని చేసేటప్పుడు నీ కన్నవాళ్లు గుర్తుకు రాలేదని అని ఛెడామడా తిడుతుంది. 

46
Guppedantha Manasu

మను అసలు జరిగింది అది కాదని, మీరు మీ కళ్లు చూపించేది చూసి మోసపోవద్దని.. నిజం ఏంటో చెబుతా అంటున్నా అనుపమ వినదు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. కాలేజీని, మమ్మల్ని వదిలేసి వెళ్లిపో అంటుంది. నేను ఇలాంటి పని చేశాను అంటే  నువ్వు నమ్ముతున్నావా..? నా గురించి నీకు తెలీదా అని మను కళ్లల్లో నీళ్లతో అడిగినా.. నమ్ముతున్నాను అని అనుపమ అంటుంది.

56
Guppedantha Manasu

అంతేకాదు.. నువ్వు ఇప్పుడు కాలేజీ వదిలివెళ్లకుంటే.. నేను ఇప్పుడే చస్తాను అని అనుపమ అంటుంది. ఆ మాటకు మను లాక్ అయిపోతాడు. మీరు అలాంటి అపశకునం మాటలు మాట్లాడొద్దని, కేవలం మీ కోసమే తప్పు చేయకున్నా.. తల దించుకొని వెళ్లిపోతున్నాను అని చెబుతాడు.

66
Guppedantha Manasu


కనీసం వసుధారకు అయినా నిజం చెప్పాలని చూస్తే.. వసు కూడా వినదు. మీరు నాకు.. రిషి సర్ ని వెతికి పెట్టడంలో సహాయం చేస్తారని అనుకున్నానని..కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటుంది. వీళ్లకు చెప్పడం కూడా వేస్ట్ అని మను వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇదంతా పక్కనే దూరంగా ఉండి.. శైలేంద్ర చూస్తాడు. ఈ మనుగాడు కాలేజీ వదిలి వెళ్లిపోతున్నాడని.. శైలేంద్ర సంబరపడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


 

click me!

Recommended Stories