బుల్లితెర షోలు వదిలేసి ఇంట్లో సుధీర్ చేస్తున్న పనులు ఇవా.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!

Published : Feb 20, 2022, 10:25 AM ISTUpdated : Feb 20, 2022, 10:55 AM IST

ఢీ రియాలిటీ షో నుండి సుడిగాలి సుధీర్ ని ఎందుకు తప్పించారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే జబర్దస్త్ షోలో మాత్రం దీనిపై సెటైర్స్ పేలుతూనే ఉన్నాయి. ఢీ సీజన్ 14లో సమూల మార్పులు చేశారు. సుడిగాలి సుధీర్ తో పాటు రష్మీ గౌతమ్, దీపికా పిల్లి, పూర్ణను సైతం తొలగించారు.

PREV
15
బుల్లితెర షోలు వదిలేసి ఇంట్లో సుధీర్ చేస్తున్న పనులు ఇవా.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!

కాగా లేటెస్ట్ జబర్దస్త్ స్కిట్ లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మధ్య దీని గురించి సంభాషణ నడిచింది. హాస్యం పంచుతూనే ఢీ నుండి ఎందుకు తప్పుకున్నారో క్లారిటీ ఇచ్చాడు. ఢీ షో చేయకపోవడానికి ప్రధాన కారణంగా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే అని సుధీర్ తెలిపాడు.

25

ఇక ఢీ షోలో చేయకపోవడం తనకు ఎంతో బాధగా ఉందని సుధీర్ అనగా.. ఆ డేట్స్ లో నువ్వు ఎక్కెడెక్కడ ఢీ కొడుతున్నావోనని నేనెంత బాధవడుతున్నానో తెలుసా? అంటూ హైపర్ ఆది పంచ్ వేశాడు. నువ్వు ఇలా మాట్లాడితే శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మిగతా మూడు షోలు కూడా మానేస్తానని సుధీర్ అన్నారు. 

35

అయితే ఇక్కడ మూడు షోలు మానేసి ఇంట్లో నాలుగు షోలు వస్తావా.. అని హైపర్ అది అనగానే సుధీర్ షాక్ అయ్యారు. రిట్రో లుక్ లో సుధీర్, హైపర్ ఆది స్కిట్ వచ్చే ఎపిసోడ్ హైలెట్ అవుతుందనిపిస్తుంది. అదే సమయంలో ఢీ షో నుండి సుడిగాలి సుధీర్ తప్పుకోవడానికి గల కారణం ఏమిటో తెలిసింది. 

45

డేట్స్ కారణంగానే ఢీ షో వదిలేసినట్లు సుధీర్ చెబుతున్నాడు. ఇందులో నిజం ఉండే అవకాశం కలదు. కారణం.. సుధీర్ హీరోగా మూడు చిత్రాల వరకు తెరకెక్కుతున్నాయి. హీరోగా మారిన సుధీర్ ఆ దిశగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. హీరోగా ఆయన ఇప్పటికే రెండు చిత్రాలు చేశారు. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాలు ఆయన హీరోగా విడుదలయ్యాయి. 

55

click me!

Recommended Stories