మద్యానికి బానిసైన స్టార్ హీరో అక్క, పాన్ ఇండియా హీరో అయినా ఏమీ చేయలేకపోయాడు.. తల్లిదండ్రులు బలవంతంగా
చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తమ తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఉండే హీరోలని చూస్తూనే ఉన్నాం.
చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తమ తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఉండే హీరోలని చూస్తూనే ఉన్నాం.
చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తమ తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఉండే హీరోలని చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా స్టార్ హృతిక్ రోషన్ కి కూడా సోదరి ఉంది. హృతిక్ రోషన్ అక్క పేరు సునైనా రోషన్. ఆమె బాలీవుడ్ లో నిర్మాతగా కూడా రాణించారు.
తాజాగా సునైనా రోషన్ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మద్యానికి బానిసైన విషయాన్ని సునైనా రోషన్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేశారు. తనని మద్యానికి దూరం చేయడం కుటుంబ సభ్యుల వల్ల కూడా కాలేదని సునైనా పేర్కొంది. నా మనసు బలహీనంగా ఉన్న సమయంలో మద్యానికి అలవాటు పడ్డాను. మనసు బాధగా ఉన్నప్పుడు మద్యం నాకు బాగా ఉపయోగపడింది. మద్యం చెడ్డ అలవాటు అని చెప్పలేం. దానిపై నియంత్రణ కోల్పోయినప్పుడే అది చెడ్డగా మారుతుంది అని సునైనా అన్నారు.
ఒక దశలో నేను మద్యంపై నియంత్రణ కోల్పోయాను. ఆ అలవాటు వ్యసనంగా మారిపోయింది. ఒక దశలో ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉన్నా. విపరీతమైన మత్తులో చాలా సార్లు బెడ్ పై నుంచి కింద పడిపోయా. నా నుంచి ఈ అలవాటుని దూరం చేయడానికి కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారు. హృతిక్ రోషన్ కూడా చాలా ట్రై చేసాడట. తల్లి దండ్రులు రాకేష్ రోషన్, పింకీ అయితే ఆమె క్రెడిట్ కార్డులు లాక్కున్నారు. స్నేహితులు వద్దకు, పార్టీలకు వెళ్లనివ్వలేదు.
అయినా కూడా తాను మద్యానికి దూరం కాలేకపోయానని సునైనా తెలిపింది. అయితే ఎట్టకేలకు ఒక దశలో తన మద్యం అలవాటు చాలా ప్రమాదకరంగా మారుతోంది అని సునైనా గ్రహించిందట. తనకి తానుగా ఈ అలవాటు నుంచి దూరం కావాలని డిసైడ్ అయిందట. దీని కోసం సునైనా రీహాబిటేషన్ సెంటర్ లో చికిత్స కూడా తీసుకుందట. చివరికి ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డట్లు సునైనా తెలిపారు. అయితే మద్యానికి ఇంతలా బానిస కావడానికి కారణం మాత్రం ఆమె చెప్పలేదు.