NTR 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ | ఇరకాటంలో ఎన్టీఆర్ ?

Published : Mar 17, 2025, 08:24 AM IST

NTR War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్‌ 2’ విడుదల తేదీని యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. షూటింగ్ ఆలస్యం అవుతున్నప్పటికీ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

PREV
14
NTR  'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ | ఇరకాటంలో  ఎన్టీఆర్ ?
NTR War 2 release date confirmed in telugu jsp

NTR War 2:   హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న ‘వార్‌ 2’ విడుదలపై కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వినిపిస్తున్న  సంగతి తెలిసిందే.  

మొదటి ప్రకటించినట్లుగా  ఈ ఆగస్టున థియేటర్లలో రావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్  ఆలస్యమవుతుండటం వల్ల వాయిదా పడే అవకాశముందని ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాలకు నిర్మాణ సంస్ద చెక్  పెట్టింది. తమ సినిమా అనుకున్న తేదీకే వస్తుందని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది.
 

24
NTR War 2 release date confirmed in telugu jsp


 చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ చేసిన ట్వీట్‌తో రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా ప్రకటన వచ్చినట్లయింది

. తాజాగా ఓ నెటిజన్‌ ‘స్పై యూనివర్స్‌’ పేరిట ఓ వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు. అందులో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై సినిమాల్లో నటించిన వాళ్లంతా గ్రూప్‌ చాటింగ్‌ చేస్తున్నట్లు.. ఆఖర్లో ఎన్టీఆర్‌ ఆ చాట్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు వీడియో క్రియేట్‌ చేశారు. 

34
NTR War 2 release date confirmed in telugu jsp


దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. ‘‘మేము ‘వార్‌ 2’ (War 2) మార్కెటింగ్‌ ప్రారంభించక ముందే మీరు అద్భుతంగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో అల్లకల్లోలం జరుగుతుంది (War 2 Release Date)’’ అంటూ విడుదల తేదీపై తొలిసారి అధికారికంగా స్పష్టత ఇచ్చింది. 


ఈ నేపథ్యంలో రిలీజ్‌ డేట్‌తో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేయాలంటూ నెటిజన్లు డిమాండ్‌ చేయడం మొదలు పెట్టారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ లో ఉంది. 
 

44
NTR War 2 release date confirmed in telugu jsp

అయితే హృతిక్ రోషన్ తో చేయాల్సిన సాంగ్ వాయిదా పడటంతో ఇప్పుడు ఎన్టీఆర్ డైలమోలో పడ్డారు. ప్రశాంత్ నీల్ తో చెయ్యాల్సిన సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలెట్టాలో తెలియని  సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.

ఈ నేపధ్యంలో వార్ 2  రిలీజ్ డేట్ వాయిదా పడితే గ్యాప్ దొరుకుతుందని, ఎన్టీఆర్ పై ప్రెజర్ పడదని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మళ్లీ తన డేట్స్ ని పక్కా చేసుకుని ఎప్పుడంటే అప్పుడు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కు వెళ్లాలి. మధ్యలో వేరే సినిమాతో క్లాష్ వచ్చినా సరే తప్పదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories