బాలీవుడ్‌లో సెలబ్రిటీలు తమకు ఉన్న ప్రాపర్టీలను ఇతర ప్రముఖులకు రెంట్‌కు ఇవ్వడం కొత్తకాదు. అయితే, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా చేసిన పని మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన తన లవర్‌కే తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రెంట్‌కు ఇచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం హృతిక్ రోషన్ సబా ఆజాద్ బాలీవుడ్ నటితో డేటింగ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ పబ్లిక్‌గా కలిసి తిరుగుతున్నారు, అంతే కాదు సోషల్ మీడియాలో కూడా తరచూ జంటగా ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు.