Folk Song : బాసింగ బలాలే, ఏషనాగుల సాంగ్స్ మిక్స్ చేస్తే ఎట్లుంటది? యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ ఫోక్ అట్లుంటది

Published : Nov 27, 2026, 11:00 AM IST

యూట్యూబ్ లో మరో తెలంగాణ జానపదం హల్ చల్ చేయడానికి సిద్దమయ్యింది. విడుదల చేసి కేవలం ఒకేఒక్క రోజు పూర్తయ్యింది… అప్పుడే ఈ సాంగ్ లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ జానపదం ఏదో తెలుసా?

PREV
14
యూట్యూబ్ మరో ఫోక్ సాంగ్ వైరల్

Folk Song : ప్రస్తుతం జానపదాల హవా నడుస్తోంది... సినిమా పాటలకంటే ఇవే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో కమర్షియల్ సినిమాల్లో కూడా పల్లెటూరి బాష, యాసలో జానపద పాటలు పెట్టక తప్పడంలేదు. సినిమాల్లో, స్పెషల్ ఆల్బమ్స్ లో వస్తున్న ఫోక్ సాంగ్స్ తెలుగోళ్లను ఆకట్టుకుంటున్నాయి... పల్లె పదాలతో కూడిన లిరిక్స్, అద్భుతమైన మ్యూజిక్ తో కట్టిపడేస్తున్నాయి. ఇలా మరో అద్భుతమైన ఫోక్ సాంగ్ విడుదలయ్యింది... యూట్యూబ్ ను షేక్ చేసేందుకు సిద్దమయ్యింది.

24
బాసింగ బలాలే, ఏషనాగుల సాంగ్స్ ను మిక్స్ చేసినట్లు..

మీరు ఇప్పటికే ''బాసింగ బలాలే'' సూపర్ హిట్ ఫోక్ వినే ఉంటారు... యూట్యూబ్ లో వీడియో సాంగ్ చూసే ఉంటారు. ఈ పాటలో అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టిన వైష్ణవి సోని గుర్తుండే ఉంటుంది. ఇక ఇటీవల ప్యారడైజ్ మూవీలో "ఏషనాగుల కట్టమీద'' సాంగ్ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటతో ఫోక్ సింగర్ జంగిరెడ్డి పేరు మారుమోగింది. అయితే బాసింగ బలాల డ్యాన్సర్ వైష్ణవి సోని, ఏషనాగుల కట్ట సింగర్ జంగిరెడ్డి కామినేషన్ లో వచ్చిన ఫోక్ సాంగ్ ''గుంపుగుంపు చింతల్లా నేరియాలో''.

డిజె శివ వంగూరు (Djshiva Vangoor) యూట్యూబ్ ఛానల్ లో ''గుంపుగుంపు చింతల్లా నేరియాలో'' సాంగ్ విడుదలయ్యింది. నిన్న నవంబర్ 26 (గురువారం) యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా ఇప్పటికే 2,55,926 వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ ఫోక్ కూడా బాసింగ బలాలే, ఏషనాగుల కట్టమీద సాంగ్స్ స్థాయిలో యూట్యూబ్ ను షేక్ చేసేలా కనిపిస్తోంది.

34
అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ సాగే అద్భుత జానపదం

అచ్చతెలుగు అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ ఓ ప్రియుడు పాడే పాటే ''గుంపుగుంపు చింతల్లా నేరియాలో''. ప్రేయసీప్రియుల సరసాలను, తెలంగాణ సంస్కృతిని ఒకేపాటలో పొందుపర్చినట్లు చక్కని పదప్రయోగాలతో ఈ పాట సాగుతుంది. ''గుంపుగుంపు గునుగుల్లా నేరియాలో... గున్నామామిడి పూసే నేరియాలో... పూసినా నవ్వుల్లా నేరియాలో.. కురిసిందే యెన్నేలా నేరియాలో'' అంటూ సాగిపోయే ఈ జానపదంలో బోనాలు, బతుకమ్మ పండగలు... వేములవాడ, కొమరవెల్లి వంటి పదాలు కూడా ఉంటాయి. ఇలా ప్రేమగీతంలో తెలంగాణ సంస్కృతిని మిక్స్ చేశారన్నమాట.

ఇక తెలంగాణ జానపదాల్లో ఎక్కువగా వినిపించే 'మదానో నా వయ్యారి' అనే లిరిక్స్ ఈ పాటలోనూ ఉన్నాయి... ఇవి ఈ జానపదాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఇలా ఆకట్టుకునే పాటపై సోని వైష్ణవి, గను చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. ముఖ్యగా సోని వైష్ణవి తన అందం, అభినయంతో మరోసారి 'బాసింగ బలాలే' సాంగ్ ను గుర్తుచేసింది.

44
గుంపుగుంపు చింతల్లా నేరియాలో సాంగ్ వెనకున్నది వీళ్లే..

గుంపుగుంపు చింతల్లా నేరియాలో అంటూ యూట్యూబ్ లో సందడి చేస్తున్న జానపద గీతాన్ని రాసింది కొడారి శ్రీను. అద్భుతమైన మాటలతో సాగే ఈ పాటకు కల్యాణ్ కీస్ వినసొంపైన సంగీతం అందించారు. ఇక సింగర్ జంగిరెడ్డి గొంతులో పడ్డాక ఈ పాట మరోస్థాయికి చేరింది.

శేఖర్ వైరస్ కొరియోగ్రఫీలో సోని వైష్ణవి, గను డ్యాన్స్ అదరగొట్టారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా ఈ పాటను రూపొదించారు డైరెక్టర్ కమ్ నిర్మాత డిజె శివ వంగూరు. ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా కుదరడంతో ఈ గుంపుగుంపు చింతల్లా నేరియాలో సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories