'కరుప్పు' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే 200 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం సూర్య కెరీర్‌లోనే ఒక మైలురాయి. వరుస ఫ్లాపులతో ఉన్న సూర్యకు ఈ సినిమా పెద్ద ఊరటనిచ్చింది. కానీ, ఈ సినిమా మొదట విజయ్ చేయాల్సింది!
సినిమా ఇండస్ట్రీలో 'టైమింగ్' చాలా ముఖ్యం. ఒకరు వదిలేసిన సినిమాతో మరొకరు స్టార్ అవ్వడం కామన్. ఇప్పుడు సౌత్ ఇండియాను ఊపేస్తున్న 'కరుప్పు' (Karuppu) సినిమా విషయంలో అదే జరిగింది. సూర్య (Suriya), త్రిష కృష్ణన్ (Trisha Krishnan) అభిమానులకు ఈ సినిమా పండగలాంటిది. కానీ ఈ సక్సెస్ వెనుక ఓ నమ్మలేని ట్విస్ట్ ఉంది! అవును, ఈ సినిమాలో సూర్య ప్లేస్‌లో దళపతి విజయ్ ఉండాల్సింది. మరి ఈ బ్లాక్‌బస్టర్ కథ విజయ్ చేజారిపోవడానికి కారణం ఏంటి? ఆ అసలు కథేంటో ఇక్కడ చూడండి!
27
బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం
డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ తీసిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు వసూలు చేసి సూర్య కెరీర్‌కు ఓ పెద్ద మైలురాయిగా నిలిచింది. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ సూర్యకు ఈ సినిమా కొత్త ఊపిరి పోసింది. మే నెలలో రిలీజైన ఈ సినిమాతో సూర్య-త్రిష కాంబో మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అయింది. కానీ, ఈ కథ మొదలైంది మాత్రం దళపతి విజయ్ ఇంట్లో!
37
డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ
డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ ఈ కథను మొదట దళపతి విజయ్ కోసమే రాసుకున్నారు. 2023 ఆగస్టులో బాలాజీ, విజయ్‌ను కలిసి కథ వినిపించారు. కథ వినగానే విజయ్ ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. 'బాలాజీ, ఈ స్క్రిప్ట్ అదిరిపోయింది, మనమే ఈ సినిమా చేద్దాం' అని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విజయ్ లాంటి సూపర్‌స్టార్ స్వయంగా అడగడంతో బాలాజీ కూడా చాలా సంతోషించారు.
అయితే, అసలు కథ ఇక్కడే మొదలైంది. స్క్రిప్ట్ బాగా నచ్చినా, అందులో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని ఆర్.జె. బాలాజీ భావించారు. 'సర్, ఈ కథను మరింత మెరుగుపరచడానికి నాకు కొంచెం టైమ్ కావాలి' అని బాలాజీ అడిగారు. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆయన సినిమా రంగానికి గుడ్‌బై చెప్పి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి (TVK పార్టీ) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే విజయ్ రాజకీయ బాధ్యతలతో బిజీ అయిపోయారు.
57
డిఫరెంట్ కాన్సెప్ట్
కథ రెడీగా ఉంది, కానీ హీరో లేని పరిస్థితి. అప్పుడు బాలాజీ, సూర్యను సంప్రదించారు. కథలోని డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చడంతో సూర్య వెంటనే ఓకే చెప్పారు. అలా విజయ్ చేయాల్సిన 'కరుప్పు' సినిమా, సూర్య 45వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో పండగ చేస్తోంది.
67
విజయ్ సర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ వల్లే
డైరెక్టర్ బాలాజీ ఈ మధ్యే ఈ రహస్యాన్ని బయటపెట్టారు. 'విజయ్ సర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ వల్లే కథ ఇంత బాగా వచ్చింది అని అన్నారు.
77
కరుప్పు కలెక్షన్స్
మొత్తం మీద, దళపతి విజయ్ చేజార్చుకున్న ఈ సినిమా సూర్యకు ఏకంగా 200 కోట్ల బహుమతిని ఇచ్చింది. సూర్య-త్రిష కెమిస్ట్రీ, ఆర్.జె. బాలాజీ మేకింగ్ ఈ ఏడాదికి ఓ పెద్ద సక్సెస్ స్టోరీగా నిలిచిపోయింది!