Private jet Cost: సొంతకారులాగే సొంత జెట్ విమానం ఉంటే ఎక్కడికైనా నిమిషాల్లో ఎగిరిపోవచ్చు. అయితే సొంత ప్రైవేట్ జెట్ విమానం కొనడం అంత సులభం కాదు. ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి? నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసుకోవాలి.
రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, నయనతార, ప్రభాస్ ఇలా ఎంతో మందికి సొంత ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ, ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు విలాసవంతమైన ప్రైవేటు జెట్ విమానాలను కలిగి ఉన్నారు. అయితే ఆ ప్రైవేట్ జెట్ విమానాలను చూసినప్పుడు సామాన్యులకు ఎన్నో సందేహాలు వస్తాయి. అది ఎంత ఖరీదు ఉంటుంది? ఎంత సంవత్సరానికి సంపాదిస్తే ప్రైవేట్ విమానం కొనగలం? ఈఎంఐ పద్ధతిలో కొంటె నెలకు ఎంత మొత్తాన్ని కట్టాలి? వంటి అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నిటికీ జవాబులు ఇక్కడే ఉన్నాయి.. మీకు ఆసక్తి ఉంటే తెలుసుకోండి.
24
ప్రైవేట్ జెట్ విమానం ధర ఎంత?
భారతదేశంలో ఎంతోమంది సెలబ్రిటీలు, బడా పారిశ్రామికవేత్తలు సొంత ప్రైవేట్ జెట్ విమానాలలో ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటాము. ఒక సొంత ప్రైవేట్ జెట్ విమానం కొనాలంటే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అయితే ఇది కేవలం ఆ విమానం ధర మాత్రమే. విదేశాల నుండి దీన్ని మన దేశానికి రప్పించడానికి రిజిస్ట్రేషన్ కు భారీగా ఖర్చు చేయాలి. ఇక జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ వంటి పన్నులు కూడా కలిపితే అదనంగా 20 కోట్ల నుంచి 22 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయి. అంటే ఒక ప్రైవేట్ జెట్ మన దేశానికి వచ్చేసరికి 70 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు అవుతుంది.
34
నెలకు ఎంత ఈఎమ్ఐ?
సాధారణంగా 70 కోట్ల రూపాయలకు పైగా సంపాదన ఉన్నవారే ఈ ప్రైవేటు జెట్ విమానాలను కొంటారు. ఒకేసారి డబ్బులు ఇచ్చి కొనేసే బిలియనీర్లే ఎక్కువ. ఒకవేళ ఈఎమ్ఐ రూపంలో కొంటె మాత్రం లోన్ పెట్టుకోవచ్చు. అయితే నెలకు ఈఎమ్ఐ కూడా భారీగానే ఉంటుంది. ఉదాహరణకు 10 కోట్లు డౌన్ పేమెంట్ గా ఇస్తే మిగతా 40 కోట్లు లోన్ రూపంలో బ్యాంకుల నుంచి తీసుకోవాలి. ఇందుకోసం బ్యాంకులు తొమ్మిది నుంచి 11 శాతం వడ్డీని తీసుకుంటాయి. ఏడేళ్ల కాలపరిమితితో లోన్ తీసుకుంటే ఏడాదికి ఎనిమిదన్నర కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అంటే నెలకి 75 లక్షల రూపాయలు ఈఎంఐగా చెల్లించాలి.
విమానం కొనడంతోనే సరిపోదు.. దాని నిర్వహణకు కూడా భారీగానే ఖర్చవుతుంది. విమానానికి ఇద్దరు పైలెట్లు, కనీసం ఒక సిబ్బంది అవసరం. వీరి జీతాలకు ఏడాదికి ఒక కోటి నుంచి కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాగే విమానాన్ని పార్కు చేయడానికి, ఇన్సూరెన్స్ చేయడానికి కోటి రూపాయలు దాకా ఖర్చవుతుంది. ఇక విమానం కండిషన్లో ఉండేందుకు చేసే మరమ్మతులు, సాఫ్ట్ వేర్ అప్డేట్స్ కోసం ప్రతి ఏడాది 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక విమానాన్ని వాడారంటే ప్రతి గంటకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి ఇంధనానికి, లాండింగ్ చార్జీల కోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే ఈ ప్రైవేటు జెట్ విమానం నిర్వహణ కోసమే ఏడాదికి 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అందుకే కేవలం బిలియనీర్లు మాత్రమే ప్రైవేటు విమానాలను కొంటూ ఉంటారు. ఏడాదికి 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయలు సంపాదించే వారే ఇలా విమానాలను కొనగలరు.