సౌత్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'జననాయగన్' సినిమా థియేటర్లలో రిలీజ్ కాకముందే పైరసీ సైట్లలో ప్రత్యక్షమవడం సంచలనం రేపుతోంది. ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంతకీ విషయం ఏంటంటే?
గత 30 ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న దళపతి విజయ్, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో 'జననాయగన్' తన చివరి సినిమా అని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు..
27
బాలకృష్ణ సినిమాకు రీమేక్..
ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఇది బాలకృష్ణ హీరోగా తెలుగులో హిట్టయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్, మమితా బైజు, నిళల్గళ్ రవి వంటి భారీ తారాగణం ఉంది. విజయ్‌కు ఇష్టమైన అనిరుధ్ సంగీతం అందించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు.
37
రిలీజ్ కు ముందే సంచలనం..
నిజానికి 'జననాయగన్' సినిమా గత ఏడాది దీపావళికే విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ ఏడాది పొంగల్‌కి వాయిదా వేశారు. జనవరి 9న రిలీజ్ అని ప్రకటించడంతో టికెట్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఎవరూ ఊహించని విధంగా సెన్సార్ బోర్డు రూపంలో సినిమా విడుదలకు అడ్డంకి ఏర్పడింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం జరగడంతో, చిత్రబృందం కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పెద్దదై, 'జననాయగన్' పొంగల్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కోర్టు విచారణను ఆలస్యం చేయడంతో, సినిమా ప్రాజెక్ట్ ఆగిపోయింది. చివరకు చిత్రబృందం కేసును వాపస్ తీసుకుని, మళ్లీ సెన్సార్ కోసం పంపింది. ఇంతలోనే ఎన్నికల తేదీలు రావడంతో సినిమా పూర్తిగా మూలనపడింది.
57
ఎన్నికల పనుల్లో బిజీగా దళపతి..
ప్రస్తుతం విజయ్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే 'జననాయగన్' సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో సంతోషంగా ఉన్న అభిమానులకు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా, మొత్తం సినిమాను పైరసీ సైట్లలో అప్‌లోడ్ చేశారు. కొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
67
ఎలా లీక్ అయింది..?
దయచేసి 'జననాయగన్' సినిమా క్లిప్స్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, మీరితే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు ప్రశాంత్ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు కేవలం సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రమే చూసిన ఈ సినిమా మొత్తం ఎలా లీక్ అయిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇది విజయ్ రాజకీయ ప్రత్యర్థుల పనేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరికొందరేమో, విజయే స్వయంగా దీన్ని లీక్ చేయించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
77
500 కోట్ల భారీ బడ్జెట్‌తో..
సినిమా మొత్తం లీక్ అవ్వడంతో, గతంలో విజయ్ 'తలైవా' సినిమాకు ఎదురైన పరిస్థితే 'జననాయగన్'కు కూడా వస్తుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 'తలైవా' సినిమా తమిళనాడులో రిలీజ్ కాకముందే పైరసీ సీడీల రూపంలో లీక్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అదే ప్రధాన కారణమైంది. ఇప్పుడు 'జననాయగన్'కు కూడా అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ సినిమాను సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం.