రాజకీయ లబ్ధి కోసం మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు... పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ మాటల దాడి!

First Published Sep 27, 2024, 2:40 PM IST

పవన్ కళ్యాణ్-ప్రకాష్ రాజ్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. తిరుమల లడ్డు కేంద్రంగా పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ కి వివాదం తలెత్తింది. తాజాగా పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. 
 

Chandra Babu

తిరుమల దేవస్థానంలో ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో ఇది జరిగిందని, అప్పటి సీఎం జగన్, టీటీడీ పాలకమండలి సభ్యులు ఇందుకు బాధ్యులని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

తిరుమల లడ్డు అపవిత్రం కావడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, అందుకు బాధ్యులను శిక్షించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. 

ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నారు. విచారణ జరిపి తప్పు జరిగితే, నేరస్థులను శిక్షించండి, దేశవ్యాప్తంగా వివాదం రేపి, మతవిద్వేషాలు రెచ్చగొట్టటం ఎందుకు.. అనే అర్థంలో ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. 
 

Latest Videos


Prakash Raj


హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇందులో ప్రకాష్ రాజ్ కి ఏం సంబంధం. మసీదుల్లో, చర్చ్ లలో ఇలాంటి అపచారాలు జరిగితే ఊరుకుంటారా? హిందూ మతం జోలికి వస్తే సహించేది లేదని కౌంటర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందించారు. 

మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. నేను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. అయినా నేను చెప్పింది ఏమిటీ? మీరు చేస్తున్న కామెంట్స్ ఏమిటీ? మీకు సమయం ఉంటే.. మరోసారి నా ట్వీట్ చదివి అర్థం చేసుకోండి... అని వీడియో బైట్ విడుదల చేశారు. 
 


అనంతరం వరుసగా ప్రకాష్ రాజ్ తెలుగులో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ ట్వీట్స్ వేస్తున్నారు. తాజాగా... మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి.. తద్వారా రాజకీయ లబ్దిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలను గాయపరచకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా..? జస్ట్ ఆస్కింగ్, అని ట్వీట్ చేశాడు. 

రాజకీయ లబ్ది కోసం తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అధికారం ఉంది కాబట్టి... మత విద్వేషాలు రేపడం మానేసి విధాన పరమైన చర్యలు తీసుకోవచ్చు.. కదా అని ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. 
 

Prakash

మొదటి నుండి ప్రకాష్ రాజ్ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్-బీజేపీతో కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీలో 1 శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీతో పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నన్ను తీవ్ర నిరాశకు గురి చేశాడని అన్నాడు. 

అప్పుడు ప్రకాష్ రాజ్ కి నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. రాజకీయ ఎత్తుగడల్లో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా అది ప్రకాష్ రాజ్ కి తెలియకపోవచ్చు. మా లీడర్ నిర్ణయాల పట్ల మాకు గౌరవం ఉందని, అసహనం వ్యక్తం చేశాడు. ప్రకాష్ రాజ్ పై నాగబాబు వ్యక్తిగత విమర్శలు సైతం గుప్పించాడు. 

2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయడం విశేషం. మంచు విష్ణుకు ప్రత్యర్థిగా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ నిలిచాడు. నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి... ప్రకాష్ గెలుపుకు కృషి చేశారు. ప్రకాష్ రాజ్ ఓటమి చెందడంతో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 

అప్పుడు మంచు విష్ణుతో మెగా ఫ్యామిలీ విభేదించింది. అనూహ్యంగా లడ్డు వివాదంతో మెగా ఫ్యామిలీకి ప్రకాష్ రాజ్ దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు మండి పడటం విశేషం. ఈ క్రమంలో  శత్రువులు మిత్రులు.. మిత్రులు శత్రువులు అయ్యారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

click me!