నాగార్జున, మహేష్‌ బాబు కలిసి నటించాల్సిన మల్టీస్టారర్‌ ఏంటో తెలుసా? దర్శకుడు హ్యాండివ్వడంతో మిస్‌

Published : Mar 14, 2025, 06:40 PM IST

Nagarjuna-MaheshBabu: కింగ్‌ నాగార్జున, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. నాగ్‌కి దర్శకుడు హ్యాండివ్వడంతో ఈ సంచలన మల్టీస్టారర్‌ మిస్‌ అయ్యింది. మరి ఆ మూవీ ఏంటో తెలుసుకుందాం. 

PREV
15
నాగార్జున, మహేష్‌ బాబు కలిసి నటించాల్సిన మల్టీస్టారర్‌ ఏంటో తెలుసా? దర్శకుడు హ్యాండివ్వడంతో మిస్‌
nagarjuna, mahesh babu

నాగార్జున తన కెరీర్‌లో చాలా మల్టీస్టారర్‌ చిత్రాలు చేశారు. ఇటీవల కాలంలోనే ఆయన `ఊపిరి` లాంటి సినిమాలు చేశారు. మొన్న `దేవదాస్‌` నానితో కలిసి చేశారు. చివరగా `నా సామి రంగా` మూవీలో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లు నటించారు. ఇప్పుడు `కూలీ`, `కుబేరా` చిత్రాల్లో రజనీకాంత్‌, ధనుష్‌లతో కలిసి నటిస్తున్నారు.

ఇలా ఎప్పుడూ ప్రయోగాలకు రెడీగా ఉంటారు నాగార్జున. ఇలానే చేయాలనే నిబంధనలు ఏం పెట్టుకోరు. అయితే పెద్ద హీరోల్లో ఒకప్పుడు మోహన్‌ బాబుతో కలిసి చేశారు. అయితే ఇప్పుడు సూపర్‌ స్టార్స్ గా రాణిస్తున్న వారిలో మహేష్‌ బాబుతోనూ సినిమా చేయాల్సి ఉండే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కాంబో సెట్‌ అయ్యేది, కానీ దర్శకుడు హ్యాండివ్వడంతో ఈ కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది. మరి అదేంటో చూస్తే.  
 

25
seethamma vakitlo sirimalle chettu

వెంకటేష్‌, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్‌ `సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మల్టీస్టారర్స్ లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌. ఈ సినిమాకి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. దిల్‌ రాజు నిర్మించారు. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్‌. ఇటీవల రీ రిలీజ్‌ చేసినా మంచి ఆదరణ పొందింది.

అయితే ఈ చిత్రంలో తండ్రి ప్రకాష్ రాజ్‌ పాత్ర కోసం మొదట రజనీకాంత్‌ని దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చేయనని తెలిపారు. కానీ ప్రకాష్‌ రాజ్‌తో వెంకీ, మహేష్‌లతో ఈ మూవీ తీశారు. 

35
nagarjuna

అయితే ఈ సినిమాకి వెంకటేష్‌ పాత్రలో మొదట శ్రీకాంత్‌ అడ్డాల అనుకున్నది నాగార్జునని. దర్శకుడు `కొత్తబంగారు లోకం` సినిమాతో హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద హీరోల నుంచి ఫోన్లు వచ్చాయి. అలా వచ్చిన మొదటి ఫోన్‌ నాగార్జున నుంచి. ఆయన పిలిపించగా, ఇలా మల్టీస్టారర్‌ కథ ఉందని, విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో అని చిన్న లైన్‌ చెప్పాడట శ్రీకాంత్‌ అడ్డాల.

సరే చేద్దాం, కథ రెడీ చేసుకురా అని చెప్పాడట నాగార్జున. ఆ కథని ప్రిపేర్‌ చేసే క్రమంలో సురేష్‌ బాబు నుంచి ఫోన్‌ వచ్చింది. సురేష్‌ బాబు, వెంకటేష్‌ లు సినిమా చేద్దామని చెబితే, నాగార్జునకి చెప్పిన కథని మరికాస్త ఎక్స్ టెంట్‌ చేసి చెప్పాడు. వాళ్లకి నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. ఆ తర్వాత దిల్‌ రాజు పిలిచారు. ఆయనకు మరికొంత కథని చెప్పారు. 
 

45
mahesh babu, nagarjuna

దిల్‌ రాజు బ్యానర్‌లోనే శ్రీకాంత్‌ అడ్డాల రెండో సినిమా చేయాల్సి. దీంతో దిల్‌ రాజు ఇన్‌ వాల్వ్ కావడం, శ్రీకాంత్‌ అడ్డాల పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేయించడం, వెంకీ ఓకే అన్నాక, మహేష్‌ వద్దకు వెళ్లడం, ఆయన కూడా ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది.

ఇలా దర్శకుడు నాగార్జున మాటని కాదని, వెంకీ వద్దకు వెళ్లి, మహేష్‌లతో కలిసి ఈ మూవీని చేశారు. పెద్ద హిట్‌ అందుకున్నారు. కానీ ఇది నాగార్జునతో వర్కౌట్‌ అయితే నాగ్‌, మహేష్‌ కాంబినేషన్‌లోనే ఈ మూవీ వచ్చేదని చెప్పొచ్చు. అలా వీరిద్దరి కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది. 
 

55
mahesh babu

ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `ఎస్‌ఎస్‌ఎంబీ29` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఓ లీక్‌ వీడియో దుమారం రేపింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నాడని, ప్రియాంక చోప్రా మరో కీలక పాత్రలో కనిపించబోతుందని సమాచారం. 

read  more: శోభన్‌ బాబు-జయలలితలా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన టాలీవుడ్‌ స్టార్ జోడీ ఎవరో తెలుసా? ఇప్పటికీ టచ్‌లోనే

also read: `దిల్‌ రూబా` మూవీ రివ్యూ, రేటింగ్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories