ప్రభాస్, హను రాఘవపూడి చిత్రం.. ఇంట్రస్టింగ్ టైటిల్.. అస్సలు ఊహించరు

Published : Jul 14, 2024, 01:49 PM IST

సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభాస్ ఏ జానర్ లో సినిమా చేయబోతన్నారనే విషయమై 

PREV
112
ప్రభాస్, హను రాఘవపూడి చిత్రం.. ఇంట్రస్టింగ్ టైటిల్.. అస్సలు ఊహించరు

 ప్రభాస్ ఇప్పుడు వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.  సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్. ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ అంతకు రెట్టింపు సక్సెస్ అందుకున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన  ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లు రీచ్ అయ్యిపోయింది. ఈ సినిమా సక్సెస్ ప్రభావం ప్రభాస్ చేస్తున్న మిగతా సినిమాల బిజినెస్ పై పడుతోంది. ఆ సినిమాల బిజినెస్ లు ఊహించని రేట్లు పలుకుతున్నాయి.  ప్రస్తతం ప్రభాస్  మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. ఇందులో వింటెజ్ ప్రభాస్ ను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. 
 

212

అలాగే  సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభాస్ ఏ జానర్ లో సినిమా చేయబోతన్నారనే విషయమై హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు టైటిల్ కూడా బయిటకు వచ్చింది. ఆ టైటిల్ మరేదో కాదు ఫౌజీ. 
 

312

ఫౌజీ అంటే అర్దం సైనికుడు. ఈ సినిమా యుద్దం నేపధ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్రామా కావటం విశేషం. సీతారామం కూడా దాదాపు ఇలాంటి నేపధ్యమే. ఇక ఫౌజీ అనేది వర్కింగ్ టైటిల్ అని, ప్యాన్ ఇండియా మార్కెట్ సరపడ టైటిల్ అవుతుందని ఇదే లాక్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా 1947 కాలంలో జరుగుతుంది. 
 

412

బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జియర్ కథ ఇది అని సమాచారం. మైత్రీమూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ చాలా కాలంగా జరుగుతోంది. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమలో హీరోయిన్ గా కనిపించబోతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తారు. వచ్చే సంవత్సరం షూట్ మొదలయ్యే అవకాసం ఉంది. 
 

512

రీసెంట్ గా   హను రాఘవపూడి   తన తదుపరి ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చారు. తన నెక్ట్స్ ప్రభాస్ తోనే అని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఈ సినిమా ఏ జానర్ లో ఉండబోతోందనేది తెలియబరిచారు. 

612

హను రాఘవపూడి మాట్లాడుతూ... “నా అప్ కమింగ్ ఫిల్మ్ ప్రభాస్ తోనే. అది ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా. ఇది చారిత్రక ఫిక్షన్ చిత్రం. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రం కోసం ఇప్పటికే మూడు పాటలు పూర్తి చేసారు.  ” అని చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ తో  అసలు హను, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ ఉందా ?.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది. 
 

712

 డైరెక్టర్ హను గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని చెప్పటంతో ఖచ్చితంగా కొత్త కథ చూడబోతున్నారనే ఆనందం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నారని వినికిడి. అలాగే  యుద్ధం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ ఉండనుందని తెలుస్తోంది.  

812

ఈ క్రమంలో హను, ప్రభాస్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి.  హను రాఘవపూడి చివరిగా ‘సీతారామం’ వంటి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకముందు కృష్ణగాడి వీరప్రేమగాధ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించారు.  
 

912
Prabhas

ఇదిలా ఉంటే   ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ సందీప్ వంగా కాంబినేష‌న్‌లో రాబోతోన్న స్పిరిట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌భాస్ సినిమాలో విల‌న్‌గా మార్వెల్ యూనివ‌ర్స్‌ చెందిన యాక్ట‌ర్‌ను సందీప్ వంగా రంగంలోకి దించుతోన్న‌ట్లు స‌మాచారం. స్పిరిట్ మూవీలో విల‌న్‌గా కొరియ‌న్ యాక్ట‌ర్ మా డాంగ్ సియోక్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

1012

మా డాంగ్ సియోక్ వీకీపీడియాలో పేజీలో అత‌డు స్పిరిట్ సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌భాస్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా స్పిరిట్ మూవీలో ఈ కొరియ‌న్ యాక్ట‌ర్ క‌నిపిస్తాడ‌ని అంటోన్నారు.మా డాంగ్ సియోక్ ప‌లు సౌత్ కొరియ‌న్ మూవీస్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. హాలీవుడ్‌లో డాంగ్ లీ పేరుతో మా డాంగ్ సియోక్ సినిమాలు చేస్తోన్నాడు. 

1112

స్పిరిట్ మూవీని పాన్ ఇండియా గా కాకుండా పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా తెర‌కెక్కించేందుకు సందీప్ వంగా ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్ష‌న్ మూవీని ఇండియ‌న్ భాష‌ల‌తో పాటు కొరియ‌న్‌, చైనీస్ భాష‌ల్లోకి డ‌బ్ చేసే రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

1212

స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న‌ట్లుగా గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో సందీప్ వంగా వెల్లడించాడు. గతంలో ఎన్న‌డూ చూడని ప్రభాస్ ను స్పిరిట్ మూవీలో చూస్తార‌ని, అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్‌తో పాటు మేన‌రిజ‌మ్స్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా తెలిపాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స్పిరిట్ మూవీని టీ-సిరీస్ నిర్మిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories