ప్రభాస్ కు 'స్త్రీ 2' సినిమా బాగా కలిసొచ్చేలా ఉంది, సుడి అంటే ఇదే

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా ‘స్త్రీ 2’. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అదేరోజు విడుదలైన వాటితో పోటీపడుతూ ప్రస్తుతం ప్రేక్షకుల ఫేవరేట్‌ మూవీగా నిలిచింది

Horror-comedy, Stree 2 , Prabhas, The Raja Saab


కామెడీ హారర్ జోనర్‌లో వచ్చిన స్త్రీ 2 మూవీ నార్త్ లో ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సిమనిమా రెండు వారాలు కావొస్తున్న బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది.  ఈ సినిమా దేశీయంగా మొత్తం రూ. 445 కోట్ల పైగా డొమెస్టిక్ నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. 
 


అలాగే స్త్రీ 2 ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులను బద్దలు కొట్టింది. మొత్తం కలెక్షన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు చేరుకున్నాయి. దీంతో కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ఆర్జించిన తర్వాత స్త్రీ 2 ఈ ఏడాది రెండవ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇక ఒరిజినల్ హిందీ చిత్రాల పరంగా స్త్రీ 2 విడుదలైన మొదటి వారంలోనే హృతిక్ రోషన్ ఫైటర్ లాంగ్ రన్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇంపాక్ట్ ప్రభాస్ రాబోయే చిత్రం పై ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. స్త్రీ 2 కు ప్రభాస్ సినిమాకు లింకేంటి అంటే హారర్ కామెడీ జానర్ .



అవును.. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ ..హారర్ రొమాంటిక్ కామెడి. మారుతి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ప్రభాస్ చేస్తున్న జూజూబి చిత్రం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ చిత్రం నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ ...సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ 400 కోట్లు అని చెప్పి షాక్ ఇచ్చారు. ఏప్రియల్ 2025 లో రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రభాస్ గత చిత్రాల తరహాలో ప్యాన్ ఇండియా స్దాయిలో విడుదల కానుంది. 
 


ఇక ఈ సినిమా జానర్ ని బట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో భారీగా బిజినెస్ చేస్తుందని నమ్ముతున్నారు. అందుకు కారణం స్త్రీ 2 బ్లాక్ బస్టర్ కావటమే. హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ 2 లో స్టార్స్ గా చెప్పుకునేందుకు లేరు. కానీ ది రాజా సాబ్ లో ప్రభాస్ వంటి స్టార్ ఉన్నారు. అతను ఆల్రెడీ హిందీ మార్కెట్ లో తనకంటూ స్దానం ఏర్పాటు చేసుకున్నారు. కల్కి చిత్రం హిందీ వెర్షన్ రికార్డ్ లు క్రియేట్ చేసింది. దాంతో ది రాజా సాబ్ సైతం నార్త్ బెల్ట్ లో దుమ్ము దులుపుతుందని భావిస్తున్నారు. విశ్వప్రసాద్ మాట్లాడుతూ..."  రాజా సాబ్ ఏప్రిల్లో వస్తోంది. మాకు ఇప్పటి వరకూ వచ్చిన నష్టాలను అది కవర్ చేస్తుంది" అని ఆయన అన్నారు.

Vishwa Prasad shopes about The Raja Saab Prabhas horror film updates out


ఇక రాజాసాబ్ చిత్రం షూటింగ్ వివరాల్లోకి వెళితే..ఈ సినిమా పెండింగ్ వర్క్ దాదాపు ఫిఫ్టి పర్శంట్ దాకా ఉందని సమాచారం. ఫౌజీ వంటి చిత్రాల మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ప్రభాస్ వచ్చి ఈ సినిమా పూర్తి చేస్తారని సమాచారం. ఈ విషయం ప్రభాస్ ముందే నిర్మాతలకు చెప్పే ఎగ్రిమెంట్ చేసారట. ఈ హర్రర్ కామెడీ చిత్రాన్ని మిగతా సినిమాల మధ్య గ్యాప్ లోనే చేస్తానని అన్నారు. అదే చేస్తున్నారు. కాబట్టి ప్రభాస్ పై ప్రెజర్ పెట్టే పరిస్దితి లేదు.


అలాగే ఇప్పుడు ప్రభాస్ ఉన్న టైట్ షెడ్యుల్ ని బట్టి రెండు,మూడు నెలల తర్వాత మాత్రమే ది రాజా సాబ్ సినిమాకు డేట్స్ కేటాయిస్తారు. ప్రభాస్ వచ్చేసరికి మొత్తం సెట్స్ రెడీ చేసుకుని ,షూటింగ్ ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఇచ్చిన డేట్స్ లో పూర్తి చేయాలని మారుతి ప్లాన్ చేసుకున్నారట. ఒక్కసారి సెట్స్ కు వస్తే పనులు అన్ని స్పీడుగా పూర్తి అవుతాయని భావిస్తున్నారట.
 

Latest Videos

click me!