సీక్రెట్ గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

Published : Aug 22, 2022, 02:07 PM IST

సింగర్ జెన్నిఫర్​ లోపేజ్ అంటేనే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆమె అంటే పడిచచ్చిపోతుంటారు ఇంటర్నేషనల్ జనాలు. ఆమె  అంటేనే ఇంటర్ నేషనల్ ఫిగర్. ఆమెకి  క్రేజ్  తో పాటు  ప్రేమ, డేటింగ్ వ వ్యవహారాలు కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి న్యూస్ ఐటమ్ అయ్యారు జెన్నీఫర్. 

PREV
15
సీక్రెట్ గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

హాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన జెన్నిఫర్​ లోపేజ్.. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ ఇస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఆమె నాలుగో పెళ్లి చేసుకుని  గూగుల్ లో హాట్ టాపిక్ అయ్యింది. జెన్నిఫర్​ లోపేజ్ స్టార్​ హీరో బెన్​ అఫ్లేక్ ను సీక్రెట్​గా పెళ్లి చేసుకుంది. 

25

ఇక జెన్నిఫర్ పెళ్ళి గురించి తెలుసుకున్న సోషల్ మీడియా జనాలు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్నేషనల్  నెటిజన్లు ఆమె పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్ కి కారణం.. జెన్నిఫర్ లోపేజ్‌ నాలుగో పెళ్ళి చేసుకోవడమే. ఇదే ఆమె అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులకు కోంపం తెప్పించింది. దాంతో నెట్టిట్ట రెచ్చిపోయారు. 

35

ఈ పెళ్లికి ముందు ఆమె గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అయితే, ఆ మూడు పెళ్లిళ్లు ఆమెకు కలిసి రాలేదు. ముగ్గురు మాజీ భర్తలతో  జెన్నిఫర్ లోపేజ్‌ డివోర్స్ తీసుకుని అఫీషియల్ గా దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ముచ్చటగా నాలుగో భర్తను సీక్వరించింది. 

45

ఇక ఇప్పడు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటీ అంటే.. జెన్నీఫర్ నాలుగో పెళ్లిలో కూడా మరో విశేషం దాగి ఉంది.  జెన్నిఫర్, బెన్ ఇద్దరూ 2002 నుంచి 2004 వరకు రెండేళ్ల పాటు డేటింగ్​ చేశారు. అప్పట్లో ఎంగేజ్​మెంట్​ కూడా చేసుకున్నారు.కాని అప్పుడు పెళ్లి చేసుకోలేదు. ఎంగేజ్ మెంట్ తరువాత వారు బ్రేకప్ చెప్పకున్నారు. 

55

ఎంగేజ్ మెంట్ బ్రేకప్ తరువాత ఈ ఇద్దరు స్టార్లు.. అప్పట్లో  వేర్వేరు పెళ్లి చేసుకున్నారు..తరువాత ఇద్దరికి పొసగకపోవడంతో విడాకులు కూడా తీసుకుని.. మళ్లీ ఈ జంట 2021లో మరోసారి ప్రేమలో పడ్డారు.. ఇక  తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎంగేజ్మెంట్ తోనే విడిపోయిన ఈజంట.. పెళ్ళి అయితే చేసుకున్నారు కాని.. ఎంత కాలం కలిసి ఉంటారు అనేది చూడాలి. 

click me!

Recommended Stories