గోవాలో రూమ్ బుక్ చేస్తాం, నటితో ఎఫైర్ పెట్టుకో.. ఆ తర్వాత మేం చూసుకుంటాం అన్నారు

Published : May 22, 2022, 12:52 PM IST

చిత్ర పరిశ్రమలో తెరవెనుక ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. నటీనటుల ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు గురించి సోషల్ మీడియాలో న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

PREV
16
గోవాలో రూమ్ బుక్ చేస్తాం, నటితో ఎఫైర్ పెట్టుకో.. ఆ తర్వాత మేం చూసుకుంటాం అన్నారు

చిత్ర పరిశ్రమలో తెరవెనుక ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. నటీనటుల ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు గురించి సోషల్ మీడియాలో న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇలాంటి న్యూస్ సెలెబ్రెటీలకు కూడా మంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతుంటాయి. ప్రేమ వ్యవహారాలతో బాలీవుడ్ లో పాపులర్ అయిన సెలెబ్రిటీలు చాలా ఉన్నారు. 

26

ఇదిలా ఉండగా ఈ పబ్లిసిటీ గేమ్ వెనుక చాలా తతంగమే జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు హిమాన్షు మాలిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తుమ్ సినిమా తర్వాత తనకి షాకింగ్ సంఘటన ఎదురైనట్లు హిమాన్షు పేర్కొన్నాడు. 

36

తనని ఫేమస్ చేస్తామని కొందరు అడిగారు. అయితే అందుకు మేం చెప్పినట్లు చేయాలి అని మ్యాగజైన్ వాళ్లు ఫోన్ లో సంప్రదించారు. కొత్త తరం హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకోవాలి. అప్పుడు అది మంచి స్టోరీ అవుతుంది. కావలసినంత పబ్లిసిటీ వస్తుంది అని చెప్పారు.

46

పబ్లిసిటీ లేకుండా ఎవ్వరూ స్టార్స్ కాలేరు. నీతో పాటు మరో ఇద్దరిని కూడా ఫేమస్ చేస్తాం అని చెప్పారు. ముందుగా నీకు గోవాలో ఒక రూమ్ బుక్ చేస్తాం. నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత ఏం చేయాలో మేము చూసుకుంటాం అని చెప్పేసరికి షాక్ అయ్యా అని హిమాన్షు తెలిపాడు. 

56

హిమాన్షు పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాల్లో నటించారు. సినిమాల పరంగా ఆయన అంత యాక్టివ్ గా లేరు. హిమాన్షు నటించిన సినిమాలు బోల్తా కొట్టడంతో అవకాశాలు కూడా బాగా తగ్గాయి. 

 

66

మల్లిక, తుమ్ బిన్, రైన్, జంగిల్ లాంటి చిత్రాల్లో హిమాన్షు నటించారు. హిమాన్షు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. హిమాన్షుతో పాటు మ్యాగజైన్ వాళ్ళు ఇలా ఇంకెతమందితో సంప్రదించారో అనే చర్చ జరుగుతోంది. 

click me!

Recommended Stories