Happy Birthday Review: `హ్యాపీబర్త్ డే` మూవీ ట్విట్టర్‌ టాక్‌.. హిలేరియస్‌ కామెడీ

Published : Jul 08, 2022, 06:55 AM IST

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నటించిన సరికొత్త జోనర్ మూవీ `హ్యాపీ బర్త్ డే`. `మత్తు వదలరా` ఫేమ్‌ రితేష్‌రానా రూపొందించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

PREV
16
Happy Birthday Review: `హ్యాపీబర్త్ డే` మూవీ ట్విట్టర్‌ టాక్‌.. హిలేరియస్‌ కామెడీ

సక్సెస్‌ కోసం తాపత్రయపడుతున్న హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కమర్షియల్‌ సినిమాలకు అతీతంగా విభిన్న కథా చిత్రాలు చేస్తుంది. హీరోయిన్లు గ్లామర్‌ పాత్రలకే పరిమితం అనే మూస ధోరణిని బ్రేక్‌ చేసి ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతుంది. జయాపజయాలకు అతీతంగా సినిమాలు దక్కించుకుంటూ రాణిస్తున్న లావణ్య త్రిపాఠి నటించిన లేటెస్ట్ మూవీ `హ్యాపీ బర్త్ డే`. `మత్తువదలరా` ఫేమ్‌ రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, సత్య, నరేష్‌ అగస్త్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడుశుక్రవారం(జులై 8)న విడుదలవుతుంది.ఈ సందర్భంగా సినిమా ముందుగానే ఓవర్సీస్‌లో విడుదలైంది. మరి అక్కడ ఆడియెన్స్ ట్విట్టర్‌లో(Happy Birthday Twitter Review) ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో చూద్దాం. 
 

26

లావణ్య త్రిపాఠి ఇలాంటి ఒక డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలో నటించడం కాస్త ఆసక్తికర అంశంగా చెప్పాలి. పైగా `మత్తువదలరా` వంటి చిన్న చిత్రంతోనే తన మార్క్ ని చాటుకున్నారు దర్శకుడు రితేష్‌ రానా. దీంతో `హ్యాపీ బర్త్ డే`చిత్రంపై కాస్త అంచనాలున్నాయి. వెన్నెల కిషోర్‌, సత్య వంటి కమేడియన్లు ఉండటంతో ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్‌ ఎక్కువగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో `హ్యాపీ బర్త్ డే`నే పెద్ద సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే సినిమా ఉందా అనేది ట్విట్టర్‌ టాక్‌లో తెలుసుకుందాం. Happy Birthday Twitter Review.

36

హ్యాపీ(లావణ్య త్రిపాఠి) బర్త్ డే పార్టీలో జరిగే సన్నివేశాలు ప్రధానంగా, అందులో పుట్టే ఫన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. తెలుగులో కొత్త జోనర్ అయిన సర్రియల్‌ కామెడీతో రూపొందిన చిత్రమిది. కామెడీతోపాటు థ్రిల్లర్‌, సస్పెన్స్ వంటి అంశాలు మేళవింపుగా ఉంటుంది. సినిమా ప్రధానంగా గన్‌ కల్చర్‌ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. ప్రభుత్వం గన్‌ కల్చర్‌ బిల్‌కి ఓకే చెబుతుంది. దీంతో జనాల్లో ప్రతి ఒక్కరికి గన్‌ లభిస్తుంది. తమ చేతిలోకి గన్‌ వచ్చాక మనుషులు ఎలా ప్రవర్తించారు, గన్‌ కల్చర్‌ వల్ల నష్టాలేంటి? గన్‌తో సినిమాలోని ప్రధాన తారాగణం ఏం చేసిందనేది సినిమా కథ అని తెలుస్తుంది. దీంతో పాటు ఓ సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుందని టాక్‌. 

46

సినిమా ఫస్టాఫ్‌ సరదాగా, ఫన్నీ వేలో సాగిందని సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తున్నారు. ఫన్నీ అంశాలే సినిమాకి బలమంటున్నారు. కామెడీ థ్రిల్లర్‌గా చాలా బాగుందని, పెట్టిన డబ్బుకి సంతృప్తినిచ్చే చిత్రమని, చాలా వరకు హిలేరియస్‌ ఎపిసోడ్లు ఉన్నాయట. కొన్ని సీన్లు బోర్‌ కొట్టించినా ఓవరాల్‌గా ఎంటర్‌టైన్‌ చేసే చిత్రమని చెబుతున్నారు. Happy Birthday Twitter Review

56

లావణ్య త్రిపాఠి కామెడీ చాలా బాగా చేసిందని, ఆమె నటనలో ఇదొక కొత్త యాంగిల్‌ అని చెబుతున్నారు. సినిమా చాలా బాగుందని, కచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు.  సత్య తన కామెడీతో విశ్వరూపం చూపించారట. లావణ్య, వెన్నెల కిషోర్‌ కూడా బాగా చేశారని టాక్‌.
 

66

`హ్యాపీ బర్త్ డే` ఇదొక అసాధారణమైన మూవీ అని, దర్శకుడు ఫస్టాఫ్ ని సెటైరికల్‌ కామెడీగా, చాలా కొత్తగా రూపొందించారని, కానీ సెకండాఫ్‌లో మాత్రం తడబడ్డాడట. రెండో భాగం ఆడియెన్స్ ఓపికని పరీక్షించేలా ఉందని అంటున్నారు. మరోవైపు సినిమాకి కాస్త నెగటివ్‌ టాక్‌ కూడా ఉంది. రెండు గంటలుసాగే ఈ చిత్రం అసలు అర్ధం లేనిదని, చాలా వరస్ట్ గా ఉందని పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం. ఈ ఏడాదిలో వచ్చిన చెత్త సినిమా అని, కొన్ని సీన్లు చాలా బాగున్నాయని, మిగిలిన సినిమా మొత్తం వేస్ట్ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి.Happy Birthday Twitter Review.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories