పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ `ఓజీ`. మాఫియా, గ్యాంగ్‌స్టర్ ప్రధానంగా రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా విడుదలైన గ్లింప్స్ కూడా హైప్‌ని అమాంతం పెంచేసింది. సినిమా రేంజ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పటికీ ఆ హైప్ అదే స్థాయిలో మెయింటేన్ అవుతుంది. ఆ మధ్య నటి శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ ఈ మూవీకి మరింత హై ఇచ్చింది.
తాజాగా పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాలో హైలైట్ పార్ట్ ఏంటో రివీల్ అయ్యింది. అది గూస్‌బమ్స్ తెప్పించేలా, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఓ ఎత్తైతే, ఈ మూవీలో ఆ పార్ట్ మరో ఎత్తు అంటున్నారు. అది ఏంటనేది చూస్తే, ఇంటర్వెల్ బ్యాంగ్ అని అంటున్నారు. `ఓజీ` ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందట.
పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్, బిగ్గెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అని అంటున్నారు. చాలా మాసీగా ఉంటుందట. హై ఆక్టేన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లు పిచ్చెక్కిస్తాయట.మరోవైపు ఆ సమయంలో వచ్చే పవన్ ఎలివేషన్ షాట్లు, అలాగే పవర్ ఫుల్ డైలాగులు ఆడియెన్స్ ని సీట్లో నిలబడనివ్వవని అంటున్నారు. ఫ్యాన్స్ కి మాత్రం పూనకాలు తెప్పించేలా ఉంటుందట.
దర్శకుడు సుజీత్ `ఓజీ`ని చాలా స్టయిలీష్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ ఎలిమెంట్లు, యాక్షన్ సీన్లతోపాటు అంతర్లీనంగా చాలా ఎమోషన్ ఉంటుందట. అది మహిళకు సంబంధించిన ఎమోషన్ అని తెలుస్తుంది. అదే సినిమాని డ్రైవ్ చేస్తుందట. ఆయా సీన్లలో పవన్ నటన, చెప్పే డైలాగ్‌లు పిచ్చెక్కించేలా ఉంటాయని అంటున్నారు. ఆ మధ్య శ్రియా రెడ్డి కూడా అదే చెప్పింది. మరి అది ఏం రేంజ్‌లో థియేటర్లో పేలుతుందో చూడాలి.
`సాహో` తర్వాత సుజీత్ రూపొందిస్తున్న మూవీ ఇది. పవన్ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్ చేస్తున్నారు. అర్జున్ దాస్,శ్రియా రెడ్డి మరో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఇది. ఈ మూవీ ఏమాత్రం బాగున్నా, ఇండియన్ సినిమా బాక్సాఫీసు లెక్కలు తారు మారు కావాల్సిందే అని అంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి.
Pawan kalyan OG Glimpse
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ ఆగిపోయింది. ఏపీలో ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్‌ని మళ్లీ స్టార్ట్ చేయబోతున్నారు. మరో 15 రోజులు పవన్ షూటింగ్‌లో పాల్గొంటే సినిమా అయిపోతుందట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు.