అయ్యో! విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా! పరిస్థితి చూస్తే అలానే ఉంది

First Published | Nov 14, 2024, 12:07 PM IST

బిగ్ బాస్ షో నుండి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్టార్ యాంకర్ ఓటింగ్ లో వెనకబడింది. 
 

Vishnupriya Bhimeneni

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరంభమై 11 వారాలు అవుతుంది. మరో నాలుగు వారాల్లో షో ముగియనుంది. ఇప్పటి వరకు పలువురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. ఈ వారానికి గాను గౌతమ్ కృష్ణ, యష్మి, టేస్టీ తేజ, పృథ్విరాజ్, అవినాష్, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. ఆ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. 

Vishnupriya Bhimeneni

అయితే విష్ణుప్రియ ఈ వారం ఎలిమినేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఓటింగ్లో వెనుకబడ్డారు. మొదటి రెండు స్థానాల్లో యష్మి, గౌతమ్ పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉన్నట్లు సమాచారం. గౌతమ్ టాప్ లో ఉండగా యష్మి నుండి ఆయనకు టఫ్ కాంపిటీషన్ ఎదురవుతుందట. ఇక మూడో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడట. అవినాష్ కంటే మెరుగైన స్థితిలో టేస్టీ తేజ ఉండటం విశేషం. 
 


Vishnupriya Bhimeneni

నాలుగో స్థానం పృథ్విరాజ్ ఉన్నాడట. ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడట. చివరి స్థానంలో విష్ణుప్రియ ఉన్నట్లు సమాచారం. ఓటింగ్ కి మరో రోజు మాత్రమే సమయం ఉంది. కాబట్టి విష్ణుప్రియ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. కానీ ఆమె తన ఆటలో ప్రత్యేకత చూపడంలో ఫెయిల్ అయ్యింది. 

Vishnupriya Bhimeneni

కంటెస్టెంట్ పృథ్విరాజ్ వెనుకబడుతూ ఆమె గేమ్ వదిలేసింది. ఇది ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఈ విషయాన్ని విష్ణుప్రియ తండ్రి ఆమెతో నేరుగా చెప్పాడు. ఓ విషయంలో నీ ప్రవర్తన పట్ల ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. నువ్వు తీరు మార్చుకుంటే బెటర్ అన్నాడు. గేమ్ పై దృష్టి తగ్గించి పృథ్వికి సేవలు చేయడం విష్ణుప్రియకు పెద్ద మైనస్. 
 

Vishnupriya Bhimeneni

ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే అది పెద్ద సంచలనమే అని చెప్పాలి. అనధికారిక ఓటింగ్ ప్రకారం ఈ వారం విష్ణుప్రియ అవుట్. ఇంకా ఒకరోజు సమయం ఉంది. ఓటింగ్ సమీకరణాలు మారొచ్చు. అదే సమయంలో పలుమార్లు ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ జరిగాయి. అధికారిక ఓటింగ్ స్టార్ మా వెల్లడించదు. టాప్ సెలెబ్ గా ఉన్న విష్ణుప్రియను బిగ్ బాస్ మేకర్స్ ఎలిమినేట్ చేయకపోవచ్చు.  

చూడాలి.. ఈ ఆదివారం మూటాముల్లె సర్దుకునేది ఎవరో. గత వారం గంగవ్వ, హరితేజ ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చేసింది. ఆమె సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక హరితేజకు తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

ఐదు వారాలు హౌస్లో ఉన్న గంగవ్వ రూ. 15 లక్షల పారితోషికం అందుకుందట. అదే సమయంలో హరితేజకు రూ. 17.5 లక్షలు దక్కాయని సమాచారం. వీరిద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. గంగవ్వ సీజన్ 4 కంటెస్టెంట్ కాగా, హరితేజ సీజన్ వన్ ఫైనలిస్ట్ కావడం విశేషం.   

Latest Videos

click me!