సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `హే బలవంత్` గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ ఆరు రోజు కలెక్షన్లు అదిరిపోయాయి. మరి నిర్మాతలు సేఫ్ అయ్యాయా?
యంగ్ హీరో సుహాస్, శివానీ నగరం జంటగా `హే బలవంత్` మూవీలో నటించారు. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి విడుదల చేశారు. ఆయన ఈ చిత్ర హక్కులు తీసుకుని రిలీజ్ చేశారు. గత శుక్రవారం(ఫిబ్రవరి 20)న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.
25
హే బలవంత్ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యిందా?
తాజాగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం. ఇటీవల చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టింది. మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు చెప్పింది. ఈ మేరకు సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఒక మూవీ బ్రేక్ ఈవెన్ కావడం చాలా కష్టంగా మారిపోతున్న నేపథ్యంలో సుహాస్ మూవీ `హే బలవంత్` సేఫ్‌లోకి వెళ్లడం విశేషంగా చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.
35
హే బలవంత్ మూవీ కలెక్షన్లు
ఈ మూవీ ఆరు రోజుల్లో సుమారు రూ.8కోట్లు వసూలు చేసింది. తెలుగు స్టేట్స్, ఓవర్సీస్‌లో కలిసి ఈ మొత్తం వచ్చాయి. ఈ లెక్కన దాదాపు నాలుగు కోట్లకుపైగా షేర్ వచ్చింది. అయితే తెలుగు స్టేట్స్ లో కంటే ఓవర్సీస్‌లో ఇది జోరు చూపించినట్టు తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత వంశీ నందిపాటి దాదాపు నాలుగు కోట్లకు తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు బ్రేక్ ఈవెన్ అయిపోయిందట. తెలుగు స్టేట్స్ లో దీనికి కాస్త తక్కువే వచ్చినా, ఓవర్సీస్‌లో రెండు కోట్లకుపైగా షేర్ సాధించినట్టు సమాచారం. దీంతో అది బ్యాలెన్స్ అయ్యిందని, ఓవరాల్‌గా వంశీ సేఫ్‌లోకి వెళ్లారని టాక్.
ఇక ఈ మూవీకి ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. రోజుకి ముప్పై, నలభై లక్షల వరకు వస్తున్నట్టు సమాచారం. అయితే రెండో వారంలోనూ ఇదే జోరు చూపిస్తే వంశీ నందిపాటికి మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉందని టాక్. కాకపోతే వీకెండ్‌లో అయితే బాగానే ఆడే అవకాశం ఉంది. వీక్ డేస్‌లో ఎలా ఉండబోతుందో చూడాలి. స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అది కొంత ప్రభావం చూపిస్తుంది. లేదంటే మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండేది.
55
హే బలవంత్ కథేంటంటే?
సినిమా కథేంటంటే? ఇందులో హీరో సుహాస్ తండ్రి బిజినెస్ చూసుకోవాలని కలలు కంటుంటాడు. కానీ తండ్రి బిజినెస్ ఏంటో తెలియదు. ఆ భ్రమల్లోనే ఉంటూ ఆయన డల్‌గా ఉన్న వ్యాపారాలను లాభాల్లోకి తెచ్చే ఉపాయాలు ఇస్తుంటాడు. అలా హీరోయిన్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో లవ్‌లో పడతారు. పేరెంట్స్ కి పరిచయం చేసుకోవాలనుకుంటారు. ఇంతలో సుహాస్ తండ్రి బలవంత్ రావ్‌కి హార్ట్ ఎటాక్ వస్తుంది. దీంతో ఆయన వ్యాపారం సుహాస్ టేకోవర్ చేయాల్సి వస్తుంది. మరి ఇంతకి తండ్రి చేసే వ్యాపారం ఏంటో తెలిసి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఎండింగ్‌లో మంచి సందేశం ఇచ్చారు.