Chiranjeevi: చిరంజీవికి 'అభిలాష', 'ఛాలెంజ్', 'మరణ మృదంగం' లాంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. దీనికి 'వజ్రాల వేట' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. వీరిద్దరి జోడీ వెండితెరపై ఒక మ్యాజిక్ సృష్టించింది. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీదేవి స్వయంగా నిర్మాతగా మారి, ఒక భారీ సినిమాను ప్రారంభించారని, కానీ అది మధ్యలోనే ఆగిపోయిందని మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన విశేషాలను స్టార్ డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
25
ఆ డైరెక్టర్ ఎవరంటే.?
చిరంజీవికి 'అభిలాష', 'ఛాలెంజ్', 'మరణ మృదంగం' లాంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. దీనికి 'వజ్రాల వేట' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో సాగే సినిమా. శ్రీదేవికి ఈ కథ బాగా నచ్చడంతో, ఆమె స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాను పట్టాలెక్కించారు.
35
షూటింగ్, అడ్డంకులు
సినిమా షూటింగ్ శరవేగంగా ప్రారంభమైంది. అప్పటికే రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే, షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు కోదండరామిరెడ్డికి కథ విషయంలో కొన్ని సందేహాలు కలిగాయి. చిరంజీవి, శ్రీదేవిల ఇమేజ్‌కు ఈ కథ సరిపోవడం లేదని, వారి కాంబినేషన్ నుంచి ప్రేక్షకులు ఆశించే రేంజ్‌లో సినిమా రావడం లేదని ఆయన భావించారు.
నిజాయితీగా తన అభిప్రాయాన్ని శ్రీదేవికి వివరించారు కోదండరామిరెడ్డి. ఈ కథ తమ ఇద్దరికీ సెట్ అవ్వదని.. ముందుకు తీసుకెళ్లడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని నిజాయితీగా చెప్పారట. దీంతో శ్రీదేవి కొంతకాలం షూటింగ్ వాయిదా వేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ సినిమా మళ్లీ పట్టాలెక్కలేదు.
55
తెలుగులో రీమేక్ చేయమని అడిగారు..
ఆ తర్వాత శ్రీదేవి తన హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్ చేయమని కోదండరామిరెడ్డిని కోరినప్పటికీ, అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ 'వజ్రాల వేట' పూర్తయి ఉంటే, మెగాస్టార్-శ్రీదేవి కాంబినేషన్‌లో మరో అద్భుతమైన చిత్రం ప్రేక్షకులకు దక్కేది. టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన కాంబినేషన్‌లో ప్రారంభమై ఆగిపోయిన చిత్రంగా ఇది మిగిలిపోయింది.