చిరు‌-చరణ్, బాలయ్య-ఎన్టీఆర్, నాగ్-చైతూ.. తండ్రీ కొడుకులిద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Published : May 23, 2022, 11:06 AM IST

చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ ఎన్టీఆర్,  నాగార్జున, నాగచైతన్య తండ్రీ కొడులిద్దరితో సినిమలు చేసి సందడి చేస్తున్నారు కొంత మంది హీరోయిన్లు..వయస్సుతో సంబంధం లేకుండా సీనియర్ హీరోలతో కూడా ఆడిపాడిన బ్యూటీస్ ఎవరు.. ?  

PREV
110
చిరు‌-చరణ్, బాలయ్య-ఎన్టీఆర్, నాగ్-చైతూ.. తండ్రీ కొడుకులిద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

యంగ్ హీరోయిన్లు యంగ్ స్టార్స్ తో నటిస్తూ.. ఏజ్ పెరుగుతున్నా కొద్ద సీనియర్ హీరోలకు కమిట్ అవ్వక తప్పడం లేదు.  ప్రస్తుతం శ్రుతి హాసన్ పరిస్థితి కూడా అదే... టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణతో సినిమాలు కమిట్ అయ్యింది. ఈ బ్యూటీ గతంలో ఈ హీరోలు తనయులతో ఆడి పాడింది. ఇలా  తండ్రీ కొడుకులతో నటించిన హీరోయిన్ల గురించి చూస్తే..
 

210

శ్రుతి హాసన్ మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా నటించబోతోంది. మెగాస్టార్ తో బాబీ తెరకెక్కిస్తున్న మాస్ మూవీలో చిరుతో రొమాన్స్ చేయబోతోంది బోల్డ్ బ్యూటీ. 

310

అయితే గతంలో శ్రుతి హాసన్ రామ్ చరణ్ జోడీగా నటించింది. ఎవడు సినిమాలో మెగా పవర్ స్టార్ తో జతకట్టింది. చరణ్ తో రొమాన్స్ చేసి.. ఇప్పుడు చిరంజీవితో కలిసి నటిస్తోంది బ్యూటీ...

410

మెగా  ప్యామిలీలో మరో ఇద్దరు స్టార్ హీరోలతో శ్రుతి హాసన్ ఆడిపాడింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లో నటించిన బ్యూటీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న తో రేసుగుర్రంలో రెచ్చిపోయింది. ఇలా తండ్రీ కొడుకుల తో కాకుండా మామా అల్లుడుతో కూడా నటించి మెప్పించింది శ్రుతి. 
 

510

అంతే కాదు ప్రతస్తుతం బాలయ్య మలినేని గోపీచంద్ తో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శ్రుతి. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రామయ్య వస్తావయ్య సినిమాలో మెరుపులు మెరిపించింది బ్యూటీ. 

610

ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో హీరోయిన్ కాజల్. రామ్ చరణ్ తో ఎక్కువ సినిమాలు జోడీగా నటించిన ఈ హీరోయిన్ మెగాస్టార్ తో కూడా రొమాన్స్ చేసింది. రామ్ చరణ్ జో్డీగా మగధీర, గోవిందుడు అందరివాడే, నాయక్, లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది కాజల్. 

710

ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా కాజల్ సినిమా చేసింది. చిరు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీలో మెగాస్టార్ జోడీగా నటించంది. అంతే కాదు ఆచార్య సినిమాలో కూడా మెగా జోడీగా నటించిన కాజల్.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది. 

810

మరో వైపు తమన్నా కూడా ఇదే ఫార్ములా ఉపయోగించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో రచ్చ రచ్చ చేసిన తమ్ము బేబీ.. మెగాస్టార్ చిరంజీవితో రీసెంట్ గా సైరా సినిమాలో నటించి మెప్పించింది. 

910

ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా అటు యంగ్ స్టార్ తో.. ఇటు సీనియర్ స్టార్స్ తో నటించడానికి సై అంటోంది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో  రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించి మెప్పించిన బ్యూటీ... కింగ్ నాగార్జునతో మన్మధుడు2 సినిమాలో బోల్డ్ సీన్స్ చేసి.. అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక రకంగా రకుల్ ఇంత హాట్ సీన్స్ ఎప్పుడూ.. ఏ సినిమాలో చేయలేదు. 
 

1010

మరో వైపు ఏజ్ పెరుగుతున్నా.. బ్యూటీలో మాత్రం యంగ్ హీరోయిన్లకు పోటీ వస్తున్న సమంత.. అటు యంగ్ హీరోలతో.. ఇటు సీనియర్ హీరోతో జతకలిసింది.  రామ్ చరణ్ తో రంగస్థతం, అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి. పుష్ప లాంటి సినిమాలు చేసిన సమంతా  రామ్ చరణ్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో మెరిసింది. 

Read more Photos on
click me!

Recommended Stories