వయ్యారాలు ఒలకబోస్తూ.. ఎంత బరువు మోసేస్తున్నారో..!

First Published May 17, 2019, 11:57 AM IST

మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు, లేడీ ఆర్టిస్ట్ లకు తమ నటన కనబరిచే స్కోప్ ఇవ్వరని, వారికి బలమైన పాత్రలు రాయడం లేదనే కామెంట్స్ వినిపించేవి.

మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు, లేడీ ఆర్టిస్ట్ లకు తమ నటన కనబరిచే స్కోప్ ఇవ్వరని, వారికి బలమైన పాత్రలు రాయడం లేదనే కామెంట్స్ వినిపించేవి. కానీ ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో హీరోయిన్లను పాటలనే పరిమితం చేయకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను రాస్తున్నారు. ఆ విధంగా మనల్ని మెప్పించిన కొన్ని స్ట్రాంగ్ ఫిమేల్ రోల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం!
undefined
మహానటి - సావిత్రి బయోపిక్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు కీర్తి సురేష్ ప్రాణం పోసింది. సినిమాలో సమంత, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ ఆంటోనీ వంటి నటులున్నా.. కీర్తి సురేష్ నుండి ఎవరూ చూపు తిప్పుకోలేకపోయారు. అంతగా మెస్మరైజ్ చేసింది.
undefined
యూటర్న్ - జర్నలిస్ట్ రచనగా ఈ సినిమాలో నటించింది సమంత. స్వతంత్ర భావాలు గల అమ్మాయిగా తన నటనతో మెప్పించింది.
undefined
'అ!' - ఈ సినిమాలో ఒక్కో పాత్ర ద్వారా ఒక్కో విషయాన్ని సొసైటీకి చెప్పాలనుకున్నారు. ఆ పాయింట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమాలో ఉన్న అన్ని ఫిమేల్ క్యారెక్టర్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాలి పాత్రలో కాజల్ పెర్ఫార్మన్స్ మెప్పిస్తుంది.
undefined
చి ల సౌ - చాలా కాలం తరువాత సుశాంత్ కి ఈ సినిమాతో సక్సెస్ వచ్చింది. కానీ కథ మొత్తం కూడా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అంజలి పాత్రలో కొత్తమ్మాయి రుహానీ శర్మ చక్కగా నటించింది. ఇండిపెండెంట్ గా ఉంటూ ఆత్మ గౌరవంతో జీవించే అమ్మాయి పాత్రలో రుహనీ బాగా సెట్ అయింది.
undefined
గీత గోవిందం - ఈ సినిమాలో గీత పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. రష్మిక తన పెర్ఫార్మన్స్ తో షాక్ ఇచ్చింది. కొన్ని చోట్ల విజయ్ దేవరకొండ ని డామినేట్ చేసింది. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.
undefined
అరవింద సమేత - ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. తన కారణంగానే కథ మొత్తం సాగేలా రాసుకున్నాడు దర్శకుడు.
undefined
సమ్మోహనం - ఈ సినిమాలో సమీరా రాథోడ్ అనే పాత్రలో అదితికి తన ప్రతిభ కనబరించే ఛాన్స్ వచ్చింది. తన అందంతో పాటు నటనతో హీరోని డామినేట్ చేసింది.
undefined
గూఢచారి - చాలా కాలం తరువాత ఈ సినిమాతో సుప్రియ రీఎంట్రీ ఇచ్చింది. నాదియా ఖురేషి పాత్రలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. తన పాత్రను తెరపై బలంగా ఎస్టాబ్లిష్ చేశారు.
undefined
రంగస్థలం - ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందులో రంగమ్మత్తగా నటించిన అనసూయ అంత పాపులర్ అయింది.
undefined
ఆర్ ఎక్స్ 100 - ఈ సినిమాలో హీరో పాత్రకు సమానంగా హీరోయిన్ రోల్ ఉంటుంది. ఇందు అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పాయల్ నటనకు వంక పెట్టలేం.
undefined
సీత - తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ లను బట్టి సినిమాలో కాజల్ డామినేషన్ ఓ రేంజ్ లో ఉందనిపిస్తుంది. ఆమె పాత్ర చుట్టూనే కథ తిరగబోతుంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
undefined
ఓ బేబీ ఎంత సక్కగున్నావే - ఓ కొరియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ లో నటిస్తోంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగనుంది.
undefined
రాజు గారి గది 2 - సమాజంలో కొందరి కారణంగా తన భవిష్యత్తుని కోల్పోయి చనిపోయిన అమృత అనే అమ్మాయి దెయ్యంగా మారి తన చావుకి కారణాలు తెలుసుకుంటుంది. అటువంటి పాత్రలో సమంత ఒదిగిపోయింది. సినిమాలో నాగార్జునతో పోటీ పడి నటించింది. అంతేకాదు.. ఈ సినిమాతో ఒక మెసేజ్ కూడా ఇచ్చింది.
undefined
భాగమతి - ఐఏఎస్ చంచలగా, భాగమతిగా అనుష్క నటన అధ్బుతమనే చెప్పాలి. ఈ సినిమాలో మినిస్టర్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నప్పటికీ అనుష్క ముందు ఎవరూ నిలబడలేకపోయారు.
undefined
click me!