ఇక టాలీవుడ్ లో సినిమాలు చేసింది బ్యూటీ... నువ్విలా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు చేసింది. ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో.. టాలీవుడ్ లో ఆఫర్లు రాలేదు. దాంతో ఇక్కడ నుంచి జెండా ఎత్తేసి.. బాలీవుడ్ లో పాతేసింది. అక్కడ కు షిప్ట్ అయిపోయింది. 2012లో ఫస్ట్ టైం హిందీ మూవీలో యాక్ట్ చేసిన యామీ.. 2017 నుంచి పూర్తి అక్కడే నటిస్తూ బిజీగా మారిపోయింది.