ఉదయ్ కిరణ్ హీరోయిన్ నుంచి హెబ్బా పటేల్ వరకు.. ఆ తప్పు చేసి కెరీర్ పాడు చేసుకున్నది వీళ్ళే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 23, 2022, 02:32 PM IST

చిత్ర పరిశ్రమలో సక్సెస్ చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్లకు. హీరోయిన్లకు గ్లామర్ కొంతవరకు కలసి వస్తుంది. కానీ కేవలం గ్లామర్ తో మాత్రమే ఎక్కువరోజులు నిలబడలేరు.

PREV
110
ఉదయ్ కిరణ్ హీరోయిన్ నుంచి హెబ్బా పటేల్ వరకు.. ఆ తప్పు చేసి కెరీర్ పాడు చేసుకున్నది వీళ్ళే

చిత్ర పరిశ్రమలో సక్సెస్ చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్లకు. హీరోయిన్లకు గ్లామర్ కొంతవరకు కలసి వస్తుంది. కానీ కేవలం గ్లామర్ తో మాత్రమే ఎక్కువరోజులు నిలబడలేరు. మంచి కథలు ఎంచుకుని విజయం సాధించాలి. అలా కెరీర్ ఆరంభంలో భారీ విజయం దక్కినప్పటికీ.. ఆ తర్వాత బ్యాడ్ స్క్రిప్ట్ లు ఎంచుకుని కెరీర్ ని పాడు చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. 

 

210

నేహా శర్మ : చిరుత చిత్రంతో నేహా శర్మకు టాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ లభించింది. చిరంజీవి తనయుడి తొలి చిత్రం.. పూరి జగన్నాధ్ డైరెక్షన్.. ఇక హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అనుకున్న విధంగానే చిరుత విజయం సాధించింది. నేహా శర్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆతర్వాత ఆమె కెరీర్ ని నిలబెట్టుకోలేకపోయింది. సరైన కథలు ఎంచుకోలేక.. కుర్రాడు అనే చిత్రం చేసింది. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో నేహా శర్మకు టాలీవుడ్ లో మరో ఛాన్స్ రాలేదు. 

 

310

అనిత హస్సానందిని : ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో నువ్వు నేను ఒకటి. ఆ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనిత హస్సానందిని. కానీ ఆ తర్వాత ఆమె శ్రీరామ్, తొట్టిగ్యాంగ్ లాంటి పసలేని కథలు ఎంచుకోవడంతో రేసులో వెనుకబడింది. క్రమంగా టాలీవుడ్ కి దూరమైపోయింది. 

 

410

రక్షిత : పూరి దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయమైన మరో హీరోయిన్ రక్షిత. ఇడియట్ చిత్రంతో రక్షిత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కానీ ఇడియట్ తర్వాత రక్షిత కథల ఎంపిక విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసింది. నిజం, ఆంధ్రావాలా లాంటి డిజాస్టర్ పడ్డాయి. మధ్యలో శివమణి చిత్రం విజయం సాధించినా అందులో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ కి పరిమితం అయింది. 

 

510

ఇషా చావ్లా : ప్రేమ కావాలి చిత్రంతో మెమొరబుల్ హిట్ సొంతం చేసుకుంది. కుర్రాళ్లు ఫిదా అయ్యే గ్లామర్ ఆమె సొంతం. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో టాలీవుడ్ లో ఆమె కెరీర్ ముగిసింది. 

 

610

కార్తీక : నాగ చైతన్య జోష్ మూవీతో కార్తీక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచింది. కానీ వెంటనే తమిళంలో రంగం చిత్రంతో బిగ్ హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ దమ్ము లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో హీరోయిన్ గా కార్తీక కెరీర్ ముగిసింది. సీనియర్ హీరోయిన్ రాధా కుమార్తె ఈ కార్తీక. 

 

710

అను ఇమ్మాన్యుయేల్ : అను ఇమ్మాన్యుయేల్ కి అప్పుడప్పుడూ ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది. మజ్ను చిత్రంతో హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, మహా సముద్రం చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. 

 

810

నందిత రాజ్ : ప్రేమ కథా చిత్రం మూవీలో నందిత నటనని ఎప్పటికి మరచిపోలేము. తన పెద్ద కళ్ళతో హర్రర్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. కానీ ఆ తర్వాత నందితకు అంతగా కలసి రాలేదు. మంచి కథలు ఎంచుకోలేకపోయింది. 

 

910

హెబ్బా పటేల్ : కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రాలంతా హెబ్బా పటేల్ జపం చేశారు. ఆమె క్రేజ్ చూసి తప్పకుండా టాలీవుడ్ టాప్ లీగ్ హీరోయిన్ల సరసన చేరుతుందని భావించారు. కానీ హెబ్బా పటేల్ బలమైన కథలు, పాత్రలు సెలెక్ట్ చేసుకోలేకపోయింది. 

 

1010

కృతి శెట్టి : ఇక్కడ కృతి శెట్టి గురించి తప్పకుండా చర్చించుకోవాలి. ఇప్పటికిప్పుడు కృతి శెట్టికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఉప్పెన చిత్రంతో డెబ్యూ హీరోయిన్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. కానీ ఇటీవల విడుదలైన శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో ఆమెది పరిమితమైన రోల్. క్రెడిట్ మొత్తం సాయి పల్లవి, నానికి వెళ్ళిపోయింది. ఇక బంగార్రాజు చిత్రంలో సర్పంచ్ గా ఆమె పాత్ర ఆశించిన స్థాయిలో పేలలేదు. సో కృతి శెట్టి ఇప్పుడే జాగ్రత్త పడకుంటే పైన పేర్కొన్న హీరోయిన్ల పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. 

 

click me!

Recommended Stories