Malaika Arora: నా జీవితం నా ఇష్టం.. మీరెవరు అడగడానికి అంటూ.. ఫుల్ ఫైర్ అవుతున్న మలైకా అరోరా

First Published | Jan 23, 2022, 2:10 PM IST

నాజీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్టు ఉంటా.. నాకు నచ్చిన తిండి తింటా.. నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా.. నాకు నచ్చినట్టు ఉంటా.. అడగటానికి మీరెవరు అంటుంది బాలీవుడ్ ఐటం బాంబ్ మలైకా అరోరా(Malaika Arora). ఇంతకీ ఆమెకంత కోపం ఎందుకు వచ్చింది.

బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా(Malaika Arora) గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. బాలీవుడ్ తో పాటు మన టాలీవుడ్ కు కూడా బాగా పరిచమం ఈ బ్యూటీ. 48 ఏళ్ల ఏజ్ లోనూ కుర్ర కారుకు సెగలు పుట్టిస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీగా ఫిజిక్ ను మెయింటేన్ చేస్తుంది మలైకా. ఇక ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అయితే అబ్బాయిలకు చెమటలు పట్టించే విధంగా ఉంటాయి.

మలైకా  సినిమాలతో పాటు సోషల్ మీడియాను కూడా బాగా మెయింటేన్ చేస్తుంది. ముక్యంగా మలైకా(Malaika Arora)  డిఫరెంట్ డ్రెస్ లతో చేసే ఎక్స్ పోజింగ్.. చూపించే సొగసులు నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తుంటాయి. అయితే ఈ విషయంలో.. ముఖ్యంగా ఆమె  డ్రెస్సింగ్‌ విషయంలోనే ఎక్కువగా ట్రోల్‌ అవుతుంటుంది.


ఈ విషయం గురించి రీసెంట్ గా స్పందించింది మలైకా(Malaika Arora).  ఓ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్‌ పై వస్తున్న విమర్శల గురించి తాను ఏమనుకుంటుందో చెప్పింది.  విమర్శలపై స్పదించింది. ఒక స్త్రీని ఎప్పుడు ఆమే వేసుకునే డ్రెస్ లను బట్టి అంచనా వేయకూడదు. కాని మన దగ్గర మాత్రం స్త్రీలు వేసుకునే  స్కర్ట్ పొడవు లేదా ఆమె నెక్‌లైన్‌ని బట్టి అంచనా వేస్తారు. అది తనకు నచ్చదంటోంది మలైకా.

అంతే కాదు  జనాల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని గడపలేనంటుంది మలైకా అరోరా (Malaika Arora). ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది ఎవరికి వారి  వ్యక్తిగత విషయం. అది నా విషయంలో కూడా నా ఎంపిక. మీరు ఒక నిర్దిష్ట విధానంలో ఆలోచించవచ్చు కానీ అది నా కోసం కాకపోవచ్చు. కాబట్టి నేను ఎవరికీ అలాంటి విషయాల గురించి చెప్పను. నాకు నా సొంతంగా ఆలోచనలు, ఎంపికలు ఉంటాయి. అందుకే నేను ఎవరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడను అంటోంది.

దానితో పాటు తాను  ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తనకు తెలసు అంటుంది మలైకా అరోరా(Malaika Arora). ఏ డ్రెస్‌ సెట్‌ అవుతుందో, ఏది బాగోదో నాకు బాగా తెలుసు. ఇది బాగా లేదు అని తనకు అనిపిస్తే... అది తాను చేయనంటోంది. ఏది ఏమైనా.. ఏది చేయాలన్నా అది తన ఆలోచన.. తన ఎంపికా అంటోంది మలైకా(Malaika Arora).. అంతే కాని ఇతరులను దృష్టిలో పెట్టుకుని తాను  తన జీవితం గడపనంటోంది. అంతే కాదు తనకు చెప్పే హక్కు ఎవరికీ లేదు అని కూడ క్లారిటీ ఇచ్చింది మలైకా. 

Malaika Arora

మరో విషయ కూడా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది మలైకా అరోరా(Malaika Arora). ప్రస్తుతం తన వయసుకి, తాను వేసుకునే బట్టలు తనకు కంఫర్టబుల్ గా ఉన్నాయట. అంతే కాదని తాను ఏమీ తెలివి తక్కువ దానిని కాదు అంటోంది. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు.. ఏం చేయాలి .. ఏం చేయకూడదు తెలియని స్థితిలో అమె లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఫైనాల్ గా తనకు నచచినట్టు తాను ఉంటాను అంటూ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది మలైకా అరోరా(Malaika Arora).

ఇక మలైకా అరోరా చాలా విషయాల్లో ట్రోలింగ్ ఫేస్ చేసింది. 1998 లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్జాజ్ ఖాన్ ను పెళ్ళి చేసుకున్న మలైకా 2017 లో విడాకులు తీసుకుంది. తరువాత తన కంటే చాలా చిన్నవాడు అయిన.. బాలీవుడ్ యంగ్ స్టార్ అర్జున్ కపూర్(Arjun Kapoor) తో డేటింగ్ లో ఉంది మలైకా. వీరిద్దరకు కలిసి పబ్లిక్ గానే చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారి తీసింది. అయినా ఏం పట్టించుకోకుండా నచ్చినట్టు ఉన్నారు వీరు.  రీసెం గా వీరి బంధాంనికి బ్రేకప్ చెప్పుకున్నారు అన్న రూమర్స్ గట్టిగా నడుస్తున్నాయి.

Latest Videos

click me!