దాదాపు రెండు దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తుంది తమన్నా భాటియా. టాలీవుడ్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో తమన్నా నటించిన హ్యాపీ డేస్, 100 % లవ్ భారీ విజయం సాధించాయి. అనతికాలంలో తమన్నా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది.
ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చరణ్ వంటి టాప్ స్టార్స్ సరసన పలు చిత్రాల్లో నటించింది. చిరంజీవి, వెంకటేష్ తో కూడా తమన్నా నటించడం విశేషం. అటు బాలీవుడ్ లో సైతం తమన్నా సత్తా చాటారు. హిందీ చిత్రాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.