F3 movie: రెడ్ మిర్చిలా తమన్నా ఘాటైన అందాలు.. F3 మూవీ నుంచి మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

Published : May 11, 2022, 04:53 PM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

PREV
16
F3 movie: రెడ్ మిర్చిలా తమన్నా ఘాటైన అందాలు.. F3 మూవీ నుంచి మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

26

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

36

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కింది. మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. 

46

హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ ఈ మూవీలో ఒక రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ రెడ్ మిర్చి లాంటి తమన్నా హాట్ స్టిల్స్ ని రిలీజ్ చేసింది. 

 

56

రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో తమన్నా మతిపోగొట్టేలా అందాలు ప్రదర్శిస్తోంది. చూపు తిప్పుకోలేని విధంగా తమన్నా మెస్మరైజ్ చేస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. ఎఫ్ 2ని మించేలా ఎఫ్3 లో కామెడీ డోస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

66
Tamannaah

ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఎఫ్3 లో మరో హాట్ బ్యూటీ కూడా నటిస్తోంది. సోనాల్ చౌహన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

click me!

Recommended Stories