మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలవుతుంది. సర్కారు వారి పాట. ఈ మూవీ ఆడియన్స్ కి పక్కా విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. ఈ ఐదు విషయాలు పరిశీలిస్తే మీకు అర్థం అవుతుంది. కాబట్టి సర్కారు వారి పాట అసలు మిస్ కాకూడదు అని చెప్పే కారణాలు ఇవే!
మహేష్ (Mahesh Babu)వరుస హిట్స్ లో ఉన్నారు. అయినప్పటికీ ఆయన మేనరిజం అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటుందనే కంప్లైంట్ ఉంది. తెలియకుండానే ఈ విషయంలో మహేష్ మూస ధోరణికి అలవాటుపడ్డారనే విమర్శ ఉంది. మహేష్ యాక్టింగ్, మేనరిజంలో మోనాటమి పెరిగిపోయిందనే భావనను మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. మహేష్ ని దర్శకుడు పరశురామ్ గతంలో ఎన్నడూ చూడని ఊరమాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ లో మహేష్ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం పూరి బిజినెస్ మాన్ ఆటిట్యూడ్ గుర్తుకొచ్చింది. సో మహేష్ తనలోని కొత్త కోణం చూపించనున్నాడు.
26
నిజానికి కీర్తి సురేష్ (Keerthy Suresh)ఫార్మ్ లో లేదు. ఆమె రీసెంట్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేదు. గత చిత్రాల్లో ఆమె లుక్ కూడా ఓ మైనస్. బరువు తగ్గాక కీర్తి సురేష్ లోని బబ్లీనెస్ పోయింది. అయితే సర్కారు వారి పాట మూవీలో కీర్తి లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆమె ఈ చిత్రంలో చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. మహేష్ తో ఆమె రొమాన్స్, లవ్ ట్రాక్ సినిమాకు హైలెట్ నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా మారిన కీర్తి చిత్రానికి కచ్చితంగా ప్లస్ అవుతుందనిపిస్తుంది.
36
ఇక సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)కు కలిసొచ్చే మరో అంశం ఏమిటంటే ఈ చిత్ర కథ మొత్తంగా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తో పాటు వాళ్ళ యాటిట్యూడ్ భిన్నంగా అనిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్ర కథ చాలా బలమైందిగా తోస్తుంది. ఇది రివేంజ్ డ్రామా అని తెలుస్తుండగా... మహేష్ మనీ మైండెడ్ ఫెలోగా వ్యవహరించడానికి, ఆయన ప్రవర్తన వెనుక ఓ బలమైన కారణం ఉందనిపిస్తుంది. ఈ ట్విస్ట్ సినిమాకే హైలెట్ గా నిలిచే అవకాశం కలదు.
46
Sarkaru Vaari Paata
ఇక సాంగ్స్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్లే. సూపర్ ఫార్మ్ లో ఉన్న థమన్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. విడుదలైన నాలుగు సాంగ్స్ దుమ్మురేపాయి. అల వైకుంఠపురంలో తర్వాత థమన్ నుండి వచ్చిన ఆ రేంజ్ ఆల్బమ్ గా సర్కారు వారి పాట చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి థమన్ మ్యూజిక్ సర్కారు వారి పాట చిత్రానికి కలిసొచ్చే మరొక అంశం.
56
ఇక దర్శకుడు పరుశురామ్ గీత గోవిందం హిట్ తో ఫుల్ ఫార్మ్ లోకొవచ్చారు. ఆ మూవీ టేకింగ్ ఆయన టాలెంట్ ఏమిటో రుజువు చేసింది. ట్రైలర్ చూశాక సర్కారు వారి పాట మూవీతో ఆయన మరో హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తుంది. మొత్తం సినిమాకు ట్రైలర్ శాంపిల్ లాంటింది. ఈ విషయంలో సర్కారు వారి పాట మేకర్స్ సూపర్ సక్సెస్. ట్రైలర్(Sarkaru Vaari Paata Trailer) కట్ అదిరింది. మహేష్ తో పాటు హీరోయిన్, విలన్ ని పరిచయం చేసిన విధానం బాగుంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సర్కారు వారి పాట పక్కా బ్లాక్ బస్టర్ అన్న నమ్మకాన్ని పెంచింది.
66
ఈ మూవీలో సముద్ర ఖని, నదియా, అజయ్, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ కీలక రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా... మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సర్కారు వారి పాట మే 12న రెండు వేలకు పైగా థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.