Ashwini Sri Remuneration: వైల్డ్ కార్డు ఎంట్రీతో అన్ని లక్షలా... 7 వారాలకు అశ్విని శ్రీ రెమ్యునరేషన్ ఎంతంటే?

Published : Nov 26, 2023, 05:02 PM ISTUpdated : Nov 26, 2023, 05:13 PM IST

కంటెస్టెంట్ అశ్విని శ్రీ 12వ వారం ఇంటిని వీడింది. ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించాడు. అశ్విని శ్రీ రెమ్యూనరేషన్ డీటెయిల్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి.   

PREV
17
Ashwini Sri Remuneration: వైల్డ్ కార్డు ఎంట్రీతో అన్ని లక్షలా... 7 వారాలకు అశ్విని శ్రీ రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 7 మొదలైన ఐదు వారాల తర్వాత 5 గురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో నయని పావని, పూజ మూర్తి, భోలే ఎలిమినేట్ అయ్యారు. అశ్వినిశ్రీ, అర్జున్ మాత్రమే హౌస్లో ఉన్నారు. 12వ వారం అశ్విని శ్రీ కూడా ఎలిమినేట్ అయ్యింది. శనివారం ఎపిసోడ్లో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించాడు. 

27

12వ వారం నామినేషన్స్ లో అశ్విని ఎవరినీ నామినేట్ చేయలేదు. దాంతో ఆమె సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా అశ్విని రిస్క్ తీసుకుంది. మొత్తానికి బలైంది. అశ్విని హౌస్లో కొంత మేర ఆకట్టుకుంది. 

 

37

అశ్విని ఐదు వారాల తర్వాత హౌస్లోకి వచ్చింది. అప్పటికే హౌస్ మేట్స్ గ్రూప్స్ గా ఏర్పడ్డారు. సీరియల్ బ్యాచ్ ఒకవైపు శివాజీ బ్యాచ్ మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారింది. అశ్విని ఈ రెండు బ్యాచ్ లలో ఎవరికీ దగ్గర కాలేదు. తన గేమ్ ఏదో తాను ఆడేది. తనను ఎవరూ పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. 

47
Bigg Boss Telugu 7

దీంతో ఆమె భోలే షావలితో స్నేహం చేసింది. భోలే-అశ్విని క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. రోజంతా వారిద్దరే మాటలు చెప్పుకునేవారు. 10వ వారం భోలే కూడా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అశ్విని మరింత ఒంటరితనం ఫీల్ అయ్యింది. భోలే వెళ్ళాక ఆమె యావర్ తో స్నేహం చేసింది. 
 

57
Bigg Boss Telugu 7

11వ వారం కూడా ఆమె డేంజర్ జోన్లోకి వచ్చింది. గౌతమ్-అశ్వినిలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. యావర్ తాను గెలుచుకున్న పవర్ అస్త్ర వెనక్కి ఇచ్చేయడంతో ఎలిమినేషన్ రద్దు చేశారు. ఈ కారణంగా అశ్విని-గౌతమ్ సేవ్ అయ్యారు. 

67
Bigg Boss Telugu 7

12వ వారం మాత్రం ఆమెపై వేటు పడింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అశ్విని 7 వారాలు హౌస్లో ఉంది. ఆమె వారానికి రూ. 1.5 లక్షలు ఒప్పందంపై హౌస్లో అడుగుపట్టిందట. ఆ లెక్కన అశ్వినికి రూ. 10.5 లక్షల రెమ్యూనరేషన్ దక్కింది. అశ్విని ఇమేజ్ కి ఇది పెద్ద మొత్తమే. 

 

77
Bigg Boss Telugu 7

అలాగే అశ్విని ఫేమ్ రాబట్టింది. ఆమెకు సినిమాల్లో వరుస ఆఫర్స్ దక్కే సూచనలు కలవు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చాక అశ్విని గతంలో చేసిన పాత్రలు, చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. 

 

Bigg Boss Telugu 7: గ్రూప్ రాజకీయాలతో నన్ను ఏకాకిని చేశారు... పోతూ పోతూ బాంబు పేల్చిన అశ్విని!

Read more Photos on
click me!

Recommended Stories