నచ్చితేనే నటిస్తా.. వచ్చిన ప్రతీ పాత్ర చేయను.. శోభిత దూళిపాళ కామెంట్స్ వైరల్..

First Published | Sep 13, 2023, 9:13 AM IST

బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది తెలుగు పిల్ల తెనాలి పిల్ల  శోభిత ధూళిపాళ. తెలుగులో కూడా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం కాకరేపుతోంది. కుర్రాళ్ళ చేత చెమటలు పుట్టిస్తోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస ఫోటో షూట్లతో అదరగొడుతోంది తెనాలి పిల్ల శోభిత. బాలీవుడ్ హీరోయిన్లను మించిన అందాల ప్రదర్శనతో అద్భుతం చేస్తోంది. యవ్వనాలన్నీ పరిచి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది. ఫ్యాషన్ డ్రస్ వేసినా.. బికినీ తొడిగినా.. చీరకట్టినా ఏ లుక్ లో అయినా సెక్సీగా కానిపిస్తుంది శోభితా దూళిపాల. ఏదికట్టినా..అందాలతో కుర్రాళ్ల మనసులతో ఆటాడుకోవడం ఆమెకు బాగా అలవాటు అయిపోయింది. 
 

ఇటీవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’లో కనిపించి అలరించింది శోభితా ధూళిపాళ్ల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ఫిదా అయ్యారు ఆడియన్స్. శోభిత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక సౌత్ లో తెలుగు, తమిళ భాషల నుంచి వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు తక్కువేమి లేవు. 
 


మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2 లో తార పాత్ర లో అద్భుతం చేసింది బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకుంది బ్యూటీ. ఎప్పుడూ తెరపై కనిపించాలి. నాకు చేతి నిండా పని ఉండాలి.. అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి పాత్రనీ ఒప్పుకోను. నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వచ్చిన అవకాశాల్లోంచి పాత్రలు ఎంచుకుంటాను అన్నారు శోభిత.
 

పాత్రల ఎంపికే తప్ప.. అవకాశాలనేవి మన చేతిలో ఉండవు. అలా జరిగితే.. కరణ్‌ జోహార్‌, ఫరాఖాన్‌లాంటి గొప్ప దర్శకులతో కలిసి పని చేస్తాను. ఆ అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాల్నే వందశాతం మనసు పెట్టి చేస్తాను.కమర్షియల్‌గా విజయవంతమైన దర్శకురాలు జోయా అక్తర్‌ ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2’లో ప్రధాన పాత్ర నాకివ్వడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అన్నారు. 

అంతే కాదు  మణిరత్నం గారితో పొన్నియిన్‌ సెల్వన్‌ లో మంచి ప్రాధాన్యం ఉన్న వాణతి పాత్రనిచ్చారు. నాలో ఉన్న ప్రతిభ గుర్తించే ఈ అవకాశం ఇచ్చారనుకుంటున్నాను.ఆ రెండు పాత్రలూ వేటికవే ప్రత్యేకం అన్నారు శోభిత. ఆధునికత, మనో నిబ్బరం, నైతిక విలువలు, హడావుడి చేసే మనస్తత్వం.. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2’ లోని తార పాత్ర నా జీవితానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పారు దూళిపాళ. 
 

ఇక వరుస అవకాశాలతో దూసుకుపోతున్న బ్యూటీ.. మంచి మంచి పాత్రలు ఎంచుకుని మరీ సినిమాలు చేస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో కాకరేపు ఫోటోషూట్లతో అదరగొడుతోంది. మూడేళ్లుగా  తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో భిన్నమైన పాత్రలు పోషించి. దర్శకనిర్మాతలతోపాటు ప్రేక్షకులకు  మనసు గెలుచుకుంది శోభిత. 
 

ఇక గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో  ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. అదే టైమ్ లో ఫారెన్ ట్రిప్ లో లంచ్ డేట్ లో వీరిద్దరు దొరికిపోయాయిరు. ఆతరువాత నుంచి పెద్దగా వీరిపై వార్తలు రావడంలేదు. 
 

Latest Videos

click me!