ఇక శృతి హాసన్ కమ్ బ్యాక్ తర్వాత సక్సెస్ ట్రాక్ లో దూసుకువెళుతున్నారు. టాలీవుడ్ లో ఆమె క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో ఆమె ఫార్మ్ లోకి వచ్చారు. లక్కీ హీరోయిన్ గా వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల శృతి నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి.
శృతి అందరినీ ఆశ్చర్యపరుస్తూ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. ప్రస్తుతం ఆమె సలార్ మూవీ చేస్తున్నారు.ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది.