ట్రెండీ అవుట్ ఫిట్ లో ఎన్టీఆర్ హీరోయిన్ స్టన్నింగ్ లుక్.. బిగుతైన డ్రెస్ లో జాన్వీ కపూర్ అందాల మెరుపులు

First Published | May 31, 2023, 6:18 PM IST

ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్స్ తో బిజీగా ఉంది. ఈక్రమంలోనే ట్రెండీ అవుట్ ఫిట్స్ లో నెట్టింట మెరుస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)  సరసన హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా తారక్ తో సెట్ అయ్యింది. దీంతో జాన్వీకి గ్రాండ్ వెల్కమ్ ఫిక్స్ అంటున్నారు. 
 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. నటిగా విభిన్న పాత్రలు పోషిస్తూ ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
 


ప్రస్తుతం జాన్వీ తన అప్ కమింగ్ ఫిల్మ్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇదే సమయంలో ఆయా సినీ ఫంక్షన్లకు అంటెండ్ అవుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది. 
 

ఈక్రమంలోనే బాలీవుడ్ యంగ్ బ్యూటీ తాజాగా కొన్ని ఫొటోలను డంప్ చేసింది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో నెట్టింట మెరుపులు మెరిపించింది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన గ్లామర్ షో గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
 

ఇక తాజాగా జాన్వీ పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో అవుట్ ఫిట్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ లెస్ అందాలతో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మరోవైపు మత్తు చూపులతో మతులు పోగొట్టింది. అలాగే మరో అవుట్ ఫిట్ లోనూ అట్రాక్ట్ చేసింది.

ప్రస్తుతం తను పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. జాన్వీ ప్రస్తుతం తారక్ కు జోడీగా ‘దేవర’ చిత్రంతో పాటు హిందీలో ‘బావల్’, ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ సినిమాలు చేస్తోంది.

Latest Videos

click me!