సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న శృతీ హాసన్..? శాంతను హజారికాతో మూడుముళ్లు.. నిజమేనా..?

First Published | Dec 27, 2023, 4:48 PM IST

ప్రియుడితో ఎప్పటికప్పుడు ఫోటోలు అప్ డేట్ చేస్తుంటుంది హీరోయిన్ శృతీ హాసన్. సడెన్ గా ఆమె పెళ్లి చేసుకుందా..? సీక్రెట్ గా పెళ్శి చేసకోవల్సిన అవసంర ఏంటి..? అసలు ఇందులో నిజం ఎంత..? 
 

ప్రస్తుతం లక్కీ హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రుతి హాసన్. సీనియర్ హీరోలకు అదృష్ట దేవతగా మారిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది శ్రుతి హాసన్. అంతకు ముందు బాలయ్య తో వీర సింహారెడ్డి, మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. శృతీ హసన్ విజయ పరంపర కొనసాగుతుంది. అంతే కాదు ఆమెకు అవకాశాలు కూడా భారీగా వస్తున్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళకు దగ్గరగా ఉన్న ఈ తమిళ బ్యూటీ.. కాస్త లేట్ గా అయినా ఇండస్ట్రీని ఏలబోతోంది. ఈక్రమంలో శృతీహాసన్ కు సబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది. 

సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ లు రావడం సర్వ సాధారణం. వారు నెట్టింట్లో అప్ డేట్ చేసేవాటిని బట్టి.. రకరకాల వార్తలు సృష్టిస్తుంటారు. అంతే కాదు కొంత మంది  సినీ తారలు తమ  వ్యక్తిగత జీవితం గురించి నిత్యం సోషల్ మీడియా సైట్స్ లో అప్ డేట్ చేస్తుంటారు. అలా శృతీ హాసన్ కూడా తన గురించి, తన సినిమాలు, తన ప్రియుడు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది.
 


సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ లు రావడం సర్వ సాధారణం. వారు నెట్టింట్లో అప్ డేట్ చేసేవాటిని బట్టి.. రకరకాల వార్తలు సృష్టిస్తుంటారు. అంతే కాదు కొంత మంది  సినీ తారలు తమ  వ్యక్తిగత జీవితం గురించి నిత్యం సోషల్ మీడియా సైట్స్ లో అప్ డేట్ చేస్తుంటారు. అలా శృతీ హాసన్ కూడా తన గురించి, తన సినిమాలు, తన ప్రియుడు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది.
 

అయితే వారు అప్ డేట్ చేసేవి కాక కొన్న రూమర్స్ కూడా స్పెర్ట్ అవుతుంటాయి. వాటిలో కొన్నినిజం అవుతాయి అనుకోండి..ఇండస్ట్రీలో ఎంతో మంది తారల ప్రేమ, పెళ్లి  వార్తలు..రూమర్లు చూస్తూనే ఉన్నాం. రోజు ఇలాంటివి ఎన్నో నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. అయితే వాటిపై కొందరు స్టార్లు వెంటనే స్పందిస్తుంటారు.. మరికొందరు చూసి చూడటనట్టు వదిలేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటివి హీరోయిన్ల విషయంలో జరుగుతుంటాయి. 
 

తాజాగా శ్రుతిహాసన్ కి సబంధించిన ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది.   శ్రుతిహాసన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.  తన ప్రియుడు శాంతను హజారికను శ్రుతి సిక్రేట్ గా పెళ్లి చేసుకుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై శ్రుతి రియాక్ట్ కాలేదు.ఇక ఇప్పుడు మరోసారి శ్రుతి పెళ్లి గురించి రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇంత రచ్చ ఎందుకు జరుగుతందంటే.. దానికి కారణం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓరీ.
 

ఈ ఓరి అనే వ్యాక్తి...  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రుతికి పెళ్లైందని అన్నాడు.  ఇంటర్వ్యూలో ఓరీ మాట్లాడుతూ.. ఒకసారి శ్రుతి హాసన్ తనతో చాలా  రూడ్‏గా ప్రవర్తించిందని  గుర్తుచేసుకున్నాడు. తనతో ఫోటో దిగాలి అనుకున్న తనతో..  శ్రుతి  ప్రవర్తించిన తీరు తనను ఎంతో బాధించందంటూ వెల్లడించాడు.. బహుశ ఆమె భర్తతో నేను మంచిగా ఉండడం వలన శ్రుతి అపార్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శ్రుతిహాసన్ పెళ్లి వార్తలు మరోసారి నెట్టింట వైరలయ్యాయి.
 

తాజాగా తన పెళ్లి రూమర్స్ పై స్పందించింది శ్రుతి. నాకు ఇంకా పెళ్లికాలేదు. ప్రతి విషయం గురించి మీతో పంచుకునే నేను.. పెళ్లి గురించి ఎందుకు దాస్తాను ?.” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతడితోనే ఆమె వివాహం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చేసింది శ్రుతి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో హిట్స్ అందుకున్న శ్రుతి..ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

Latest Videos

click me!