చీరలో చిలిపిగా సోయగాలు విరజిమ్ముతున్న తెలుగు హీరోయిన్ శివాత్మిక... ఆ కొంటె చూపులకు ఎవరైనా పడిపోవాల్సిందే!

Published : Apr 21, 2023, 01:36 PM IST

అచ్చ తెలుగు హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ చీరలో సోయగాల విందు చేసింది. కొంటె చూపులతో కట్టిపడేసింది. స్టార్ కిడ్ గ్లామర్ ట్రీట్ కి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.   

PREV
15
చీరలో చిలిపిగా సోయగాలు విరజిమ్ముతున్న తెలుగు హీరోయిన్ శివాత్మిక... ఆ కొంటె చూపులకు ఎవరైనా పడిపోవాల్సిందే!
Shivathmika Rajashekar

ఓ ప్రమోషనల్ షూట్ లో భాగంగా స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించింది శివాత్మిక. సాంప్రదాయ కట్టులో కూడా అందాలతో కవ్వించింది. శివాత్మిక సోయగాలు చూసాక ఆగలేకున్న కుర్రాళ్ళు చిలిపి కామెంట్స్ చేస్తున్నారు. శివాత్మిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

25
Shivathmika Rajashekar

శివాత్మిక లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె అలరించారు. ఓ తరహా పాత్రలకు శివాత్మిక చక్కగా సెట్ అవుతారు. రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ రాలేదు.

35
Shivathmika Rajashekar

శివాత్మికకు మంచి పాత్రలు దక్కుతున్నా కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. చెప్పాలంటే శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు.  హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. 
 

45
Shivathmika Rajashekar

గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 
 

55
Shivathmika Rajashekar


శివాత్మికను కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు ఎదగడం అంత ఈజీ కాదు. ఈ విషయం చాలా మంది హీరోయిన్స్ విషయంలో రుజువైంది. అందుకే శివాత్మిక కోలీవుడ్ మీద కూడా కన్నేశారు. మరి ఈ స్టార్ కిడ్ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 
 

click me!

Recommended Stories