రీ ఎంట్రీకి రెడీ అవుతున్న హీరోయిన్ సంఘవి, ముహూర్తం ఎప్పుడంటే..?

Published : Jul 02, 2023, 12:00 PM IST

ఒకప్పుడు హీరోయిన్లుగా వెండితెరను ఏలిన వారంతా.. రీ ఎంట్రీలతో అదుగొడుతున్నారు. ముఖ్యంగా 90స్ హీరోయిన్ లు.. గ్లామర్ మదర్స్ గా.. హీరోలకు సిస్టర్స్ గా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలస్తోంది.   

PREV
17
రీ ఎంట్రీకి రెడీ అవుతున్న హీరోయిన్ సంఘవి, ముహూర్తం ఎప్పుడంటే..?

90స్ లో స్టార్ హీరోల సరసన మెరిసి.. హీరోయిన్లుగా స్టార్ డమ్ సాధించిన  బ్యూటీస్ చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యారు. మరికొంత మంది మాత్రం ఫారెన్ లో సెటిల్ అవ్వగా.. ఇప్పుడిప్పుడే కొంత మంది రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే  ఇంద్రజ లాంటిస్టార్స్ రీ ఎంట్రీ ఇచ్చేశారు కూడా. ఇక తాజాగా మరో హీరోయిన్ సంఘవి రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. 

27

Sanghavi

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది సంఘవి.. సౌత్ లో స్టార్  నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత సంఘవి వెండితెరకు పూర్తిగా దూరం అయ్యింది.  సంఘవీ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలమైంది. పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ కు ఫిక్స్ అయిపోయింది. 

37

2016లో  సాఫ్ట్ వేర్  సంస్థ అధినేత వెంకటేష్‌ను పెళ్లి చేసుకుంది సంఘవి. ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతే కాదు వీరికి ఓ పాప ఉంది. పెళ్ళి తరువాత బయట పెద్దగా కనిపించలేదు సంఘవి. సినిమా ఫంక్షన్స్ కు కూడా దూరంగా ఉంది. కొన్నాళ్ల తరువాత కొన్ని టీవీ షోస్ కు జడ్జిగా కనిపించింది. 
 

47

రీసెంట్ గా సంఘవి  తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయింది సంఘవి. ఆడియన్స్ ఆమెను పోల్చుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఇక స్వామివారి దర్శనం తరువాత బయటకు వచ్చిన ఆమెను అభిమానులు చుట్టుముట్టి ఫోటోలు తీసుకోవడం మొదలు పెట్టారు. 

57

Sanghavi

ఇక ఈక్రమంలో మీడియా సంఘవిని పలకరించగా.. కాసేపు మాట్లాడారు. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే  అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా.. ఓపిగ్గా సమాధానం చెప్పారు ఆవిడ.  ప్రస్తుతం టీవీషోల జడ్జిగా చేస్తున్నానని, మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చారు సంఘవి. 

67

సంఘవిని చూసిన అభిమానులు.. మళ్ళీ సినిమాల్లో ఆమె యాక్టీవ్ అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. అజిత్ నటించిన అమరావతి అనే తమిళ్ మూవీతో కెరీర్ స్టార్ చేసి కోలీవుడ్ ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్లతో కలిసి నటించింది. 

77
Actress Sanghavi

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజ శేఖర్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. చివరిగా ‘కొలాంజి’ అనే తమిళ్ సినిమాలో యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని భార్యగా కనిపించింది. ఆ తరువాత వెండితెరకు దూరం అయ్యింది సంఘవి. 

click me!

Recommended Stories